PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా సెయింట్ థెరీసా మహిళా కళాశాల 70 ప్లాటినం జూబ్లీ వేడుకలు..

1 min read

ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంశాఖ మంత్రి  తానేటి వనిత..ఈ కాలేజీలో విద్యనభ్యసించి

ఈ స్థాయికి వచ్చాను..ప్రతి గురువుకి రుణపడి ఉంటాను..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : స్థానిక గవరవరంలో ఉన్న సెయింట్ థెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో 70 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా శుక్రవారం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను సెయింట్ థెరిసా విద్య సంస్థల్లో ఇంటర్మీడియట్ వరకు చదువు కోవడం జరిగిందని అప్పటి కాలంలో నాకు విద్య నేర్పిన ప్రతి గురువుకు నేను ఇంత స్థాయిలో ఉన్నానంటే వారికి రుణపడి ఉంటానని తెలిపారు. మనపై తల్లిదండ్రులు తో పాటు ఉపాధ్యాయులు ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడు వృధా చేయకుండా మంచి నడవడికతో నడుచుకోవాలని సూచించారు. నేను చదువుకున్న కళాశాలలోనే నాతోటి విద్యార్థులతో పాటు చదువు నేర్పిన ఉపాధ్యాయుల మధ్య ఒక ముఖ్య అతిథిగా పాల్గొనడం అది నేను చేసుకున్న అదృష్టమని మన దేశంలోనే ఉన్న ప్రతి రాష్ట్ర హోమ్ మినిస్టర్ లో నేను ఒక్కదాన్నే మహిళ హోమ్ మినిస్టర్ కావడం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళలపై ఇచ్చిన నమ్మకానికి నేను నిదర్శనం అని పేర్కొన్నారు. అనంతరంకళాశాలల యాజమాన్యం హోమ్ మినిస్టర్ తానేటి వనితకు సాలువ కప్పి మెమెంటో అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో అతిథులుగా పాల్గొన్న కళాశాల పూర్వ విద్యార్థులు ఐపీఎస్ అధికారి బి.రాజకు మారిను, ప్రముఖ సినీనటి స్నిగ్ద, కొంత మంది అతిధులను సన్మానించారు. ఈకార్యక్ర మంలో కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్ పి.మెర్సీ, వైస్ ప్రిన్సిపల్ మహాలక్ష్మి, గోపీనాథ్, తదితర అధ్యాపకులు , ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author