PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ సేవలు అభినందనీయం..

1 min read

– ఎస్పీ మేరీ ప్రశాంత్ కి పలువురు ప్రశంసలు..

– మహిళల రక్షణ కవచం..  ‘ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్’

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి, ఐపీఎస్. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మహిళలు రాత్రిపూట ప్రయాణ సౌకర్యాలు లేక మహిళలు పడుతున్న ఇబ్బందులను గమనించి,  వినూత్నమైన ఆలోచనతో మహిళలకు ప్రతి రోజు రాత్రి 10 pm నుండి 5 am ల మద్య, ‘వుమెన్ డ్రాప్ ఎట్ హోం’ అనే సేవలను ఏలూరు పట్టణం నందు ప్రారంభించడం జరిగింది.ఇప్పటివరకు అనేకమంది మహిళలు ఈ ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ సేవలను వినియోగించుకోవడం జరిగింది.ఈ సేవలో రాత్రి 10 గంటల తర్వాత మహిళలు ఒంటరిగా దూర ప్రాంతాల నుంచి ఏలూరు కు వచ్చి లేదా వారి గమ్యస్థానం చేరడానికి రవాణా సౌకర్యం లేకపోతే, పోలీస్ కంట్రోల్ రూమ్ 100/112 కు ఫోన్ చేసిన యెడల ఉమెన్ డ్రాప్ ఎట్ హోం వాహనము మహిళా కానిస్టేబుల్ తో వచ్చి , ఆ మహిళలను గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతూ ఉన్నది.ఏలూరు కంట్రోల్ రూమ్ కి రాబడిన సమాచారం ప్రకారం 23/24.05.2023 వ తేది ఉదయం 03:35 AM మావూరి విజయ W/O రాహుల్, A/48 అనే ఆమె ట్రైన్ దిగి ఆవిడ ఒంటరిగా ఉండడం వాళ్ళ ఇంటికి వెళ్లడానికి సరైన ట్రాన్స్ పోర్ట్ లేనందున ఆమె  తనని ఇంటికి చేర్చవలసింది గా పోలీస్ కంట్రోల్ రూమ్ కి  కాల్ చేయగా వెంటనే  ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ సిబ్బంది వెంటనే స్పందించి  03:54 AM కి రైల్వే స్టేషన్  కి చేరి ఆవిడను పిక్ అప్ చేసుకొని ద్వారకా నగర్ ,2 రోడ్ ,ఏలూరు నందు తన ఇంటి వర్ధ  04:04 AM కు డ్రాప్ చేయడం జరిగింది.ఏలూరు పట్టణంలో డ్రాపెట్ హోం కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ  మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారికి కంట్రోల్ రూమ్ ఎస్సై  క్రాంతి ప్రియకి పోలీస్ సిబ్బంది కి ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలియ చేసినారు.

About Author