మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
1 min read– వీహెచ్పీ కేంద్రీయ సహ కార్యదర్శి గుమ్మళ్ళ సత్యం
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తద్వారా అశేష హిందూ సమాజంలో సామాజిక, ఆర్థిక స్వావలంబన జరుగుతుందన్నారు వీహెచ్పీ ద్రీయ సహ కార్యదర్శి గుమ్మళ్ళ సత్యం. ఆదివారం విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర సేవ విభాగం ఆధ్వర్యంలో కీ.శే. గుంణంపల్లి పుల్లారెడ్డి స్థాపించిన విజ్ఞాన పీఠం (అరక్షిత శిశు మందిరం) వారి దాతృత్వంతో హరిశ్చంద్ర షరీన్ నగర్ శ్రీ సద్గురు త్యాగరాజ సీతా రామాలయ కళ్యాణ మంటపం లో శ్రీ శారదామాత ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఆత్మనిర్బర్ భారత్లో భాగంగా వీహెచ్పీ సేవా విభాగం నేతృత్వంలో దక్షిణ ఏపీలో మొట్టమొదటగా కుట్టు శిక్షణ కేంద్రం కర్నూలులో ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. అనంతరం రాష్ట్ర కార్యాధ్యక్షలు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ షరీన్ నగర్ మరియు చుట్టుపక్కల కాలనీలలో ఉండే బడుగు బలహీనవర్గాల మాతృమూర్తులు, యువతులు కుట్టుమిషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని.. ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కర్నూలు నగర విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహా రెడ్డి మాట్లాడుతూ మాతృమూర్తులు యువతులందరూ కుట్లు, అల్లికల తో పాటు బ్యూటీషియన్ కోర్సులు, ఫ్యాషన్ డిజైనింగ్ వంటివి నేర్చుకుని అభివృద్ధి పథం లో ప్రయాణించాలని కాంక్షించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహ కార్యదర్శి ప్రాణేష్,రాష్ట్ర ధర్మప్రసార్ కన్వీనర్ ఏ.వీ.ప్రసాద్,విభాగ్ సేవా కన్వీనర్ గురుమూర్తి,నగరకార్యాధ్యక్షులు గోరంట్ల రమణ, నగర కార్యదర్శి భానుప్రకాష్ మాళిగి, మాతృశక్తి నగర సంయోజిక శ్రీమతి భార్గవి, సద్గురు త్యాగరాజ సీతా రామాలయ కమిటీ అధ్యక్షులు ఉదయ ప్రసాద్,వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.