పోలీసు కుటుంబాల మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి..
1 min read
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఎపిఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన … జిల్లా ఎస్పీ , ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ .
పోలీసు కుటంబాలకు మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు .
కర్నూలు, న్యూస్ నేడు: మహిళలు, బాలికల భద్రతే ద్యేయమని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ , ఎపిఎస్పీ కమాండెంట్ 2 వ బెటాలియన్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ లు శనివారం తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో కర్నూలు అమీలియో హాస్పిటల్, కర్నూలు ఒమేగా హాస్పిటల్స్ డాక్టర్ల ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాల మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం ను జిల్లా ఎస్పీ , ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉచిత మెగా వైద్య శిబిరం ను ప్రారంభించారు . మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మాట్లాడారు.ప్రతీ ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్పెషలిస్టు డాక్టర్ల చే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రంగాల్లో మహిళా సాధికారతను పెంపొందించాలన్నారు. వారి కృషిని అభినందించాలన్నారు. లింగ సమానత్వం పై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్ద్యేశమన్నారు. ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ మాట్లాడుతూ… మహిళలు భర్త, పిల్లల గురించే ఎప్పుడూ ఆలోచిస్తారే కానీ మహిళలు ఎప్పుడూ తమ ఆరోగ్యం గురించి ఆలోచించరన్నారు. ఎదైనా అత్యవసరమైతే తప్ప హాస్పిటల్ కు వెళ్ళరన్నారు.మహిళలు సరైన అవగాహాన లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, ఆరోగ్య సమస్యలుంటే ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.మన కోసం, మన ఆరోగ్యం కొరకు రోజూ కొద్ది సేపు సమయం కేటాయించి నడక, యోగా వంటివి చేయాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ , ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ కలిసి కర్నూలు అమీలియో, కర్నూలు నందికొట్కూరు రోడ్డులో ఉన్న ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్లను శాలువతో సన్మానించి , మెమెంటోలు అందజేశారు. 2 డిఈకో, ఈసిజి, బిపి, షుగర్, హెచ్ బి, కంటీ పరీక్షలను అమిలీయో హాస్పిటల్ డాక్టర్లు నిర్వహించారు. పాప్ స్మియర్, మమోగ్రఫీ, బి.పి. షుగర్ పరీక్షలను ఒమెగా హాస్పిటల్ డాక్టర్లు నిర్వహించారు. మొత్తం 324 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి , ఉచితంగా మెడిసిన్ ను పంపిణీ అందజేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు అమీలియో హాస్పిటల్ డాక్టర్లు లక్ష్మీ ప్రసాద్, శృతి, రేవతి, విజయలక్ష్మీ, విష్ణుచంద్రిక, మునీరా బేగం, పవన్ తేజ ఒమెగా హాస్పిటల్ డాక్టర్లు ఆదిత్య , శిల్ప, మార్కెటింగ్ టీం షేక్షావళి, రంజిత్ కుమార్, పోలీసు వేల్పేర్ యూనిట్ హస్పిటల్ డాక్టర్ శ్రీమతి ఆర్. స్రవంతి , డిఎస్పీలు శ్రీనివాసాచారి, బాబు ప్రసాద్ , ట్రైనీ డిఎస్పీ ఉషశ్రీ, భాషా, భాస్కర్ రావు , ప్రసాద్, సిఐలు, ఆర్ ఐలు , ఆర్ ఎస్సైలు , మహిళా పోలీసులు , మహిళా హోంగార్డులు మరియు పోలీసు కుటుంబాల మహిళలు పాల్గొన్నారు.