కుటుంబ పోషణలో.. మహిళలదే కీలక పాత్ర
1 min readగుడ్ నైబర్స్ ఇండియా సంస్థ మేనేజర్ నాగేశ్వర
పల్లెవెలుగువెబ్, రాయచోటి: సమాజంలో కుటుంబ పోషణలో మహిళలదే కీలక పాత్ర ఉంటుందని గుడ్ నైబర్స్ సంస్థ మేనేజర్ నాగేశ్వర పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద మహిళలకు తమ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. గుడ్ నైబర్స్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సహాయం పొందిన మహిళల స్థితి గతులను అడిగి తెలుసుకొని వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో తమ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో కరోనా బాధిత కుటుంబాలకు ప్రాముఖ్యత ఇస్తామని ఆయన తెలిపారు. అనంతరం గతంలో
సహాయం పొందిన మౌనిక అనే మహిళ విజయ గాధను వివరించారు. మౌనిక చదువు ఇంటర్ పూర్తి చేసింది ఆ తర్వాత పెళ్లి పిల్లలు సంసార బాద్యత అంతటి తో జీవితం ఆగిపోయింది అని ఆలోచించ లేదు భర్త సంపాదన అంతంత మాత్రం పెద్దగా ఆస్తులు లేవు. ఇద్దరు పిల్లలు చదువు సంసార బాద్యత గుర్తు చేసుకొని బాధపడుతూ కూర్చో లేదు, తనకున్న టైలరింగ్ నైపుణ్యం తో తన జీవితాన్ని మార్చుకోవాలని ఆలోచించి బోటిక్ సెంటర్ లో ఇద్దరి పసి పిల్లలను చూసుకుంటూ టైలరింగ్ నందు మంచి ప్రావీణ్యం సంపాదించింది ..ఈ రోజు ఇంటిలో కూర్చొని నెలకి 50 వేల నుండి 70 వేల రూపాయల వరకు సంపాదించుతూ తనకున్న నైపుణ్యాన్ని ఇంకా కొంత మంది మహిళలకు నేర్పిస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తూన్న గొప్ప వనిత కి మహిళా దినోత్సవం సందర్భంగా గుడ్ నైబర్స్ ఆర్గనైజేషన్ ద్వార ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అమ్మా.. మీ సంకల్పానికి చేతులు జోడించి నమస్కారాలు.. మీరు ఇలాగే ఇంకా కొంతమందికి సహాయం చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకొని పదిమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను🙏
Is my jode my immediate response please