PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలు.. మహారాణులు..

1 min read

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

  • సెయింట్​ జోసెఫ్​ మహిళా డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్​ డా. పౌలీన్​ నుస్సి

పల్లెవెలుగు, కర్నూలు: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని.. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మహిళలు ముందుంటారన్నారు సెయింట్​ జోసెఫ్​ మహిళా డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్​ డా. పౌలీన్​ నుస్సి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని సెయింట్​ జోసెఫ్​ మహిళా డిగ్రీ కాలేజిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిప్​ డా. పౌలీన్​ నుస్సి మాట్లాడుతూ మహిళలు విద్య, వైద్యం, రాజకీయం, సామాజికంగా … ఇలా అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. మధర్​ థెరిస్సా, కల్పనా చావ్ల, పివి సింధు, మేరికామ్​ తదితర మహిళలు ఉన్నత శిఖరాలు అధిరోహించారని, వారందరినీ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం కాలేజిలో నిర్వహించిన వక్తృత్వ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.  ఆ తరువాత విద్యార్థినులకు మంచి విద్యాబోధన అందించడంలో అధ్యాపకులు సఫలమయ్యారని చెప్పేందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులకు బెస్ట్​ ఉమెన్​ అవార్డు ఇచ్చారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెవరెండ్​ సిస్టర్​ రాజమ్మ న్యాయం, నమ్మకం, సమానత్వం, క్షమాపణ తదితర అంశాలపై విద్యార్థినులకు క్షుణ్ణంగా వివరించారు.  కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్​ డా. పౌలీన్​ నుస్సి, రెవరెండ్​ సిస్టర్​ రాజమ్మను అధ్యాపకులు, విద్యార్థినులు శాలువ కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

About Author