మహిళలు అన్ని రంగాలలో ఆర్థిక అభివృద్ధి సాధించాలి
1 min read– ఎంఈఓ-2 సునీత
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మహిళలు అన్ని రంగాలలో ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని ఎంఈఓ-2 సునీత అన్నారు, శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఎంఈఓ-2 సునీత మాట్లాడుతూ, ఏ కుటుంబంలోనైనా మహిళ లేకుంటే ఆ కుటుంబ పురోగతి సాధించలేదని అలాగే కుటుంబంలోని తల్లిదండ్రులు తన కుమారుని చదివించినట్లు తన కుమార్తెను కూడా పెద్ద చదువులు చదివిస్తే నా కుటుంబానికి కాకుండా సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు, అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థినిని చేర్పించేటప్పుడు ఆ బాలిక తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని బాలికలను ఉన్నత చదువులు చదివించే విధంగా వారికి తెలియజేయాలని ఆమె అన్నారు, ఎంఈఓ గంగిరెడ్డి మాట్లాడుతూ, నేటికీ మహిళల అక్షరాస్యత తక్కువగా ఉందని, అక్షరాస్యత సాధించే దిశగా వారిని ప్రోత్సహించాలని అప్పుడే కుటుంబంతో పాటు సమాజం, సమాజంతో పాటు దేశం కూడా బాగుపడుతుందని ఆయన తెలిపారు, అనంతరం మహిళ ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సత్కరించారు, ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల ప్రధమ ఉపాధ్యాయనీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.