PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : జిల్లా జడ్జి కవిత

1 min read

పల్లెవెలుగువెబ్​: చెన్నూరు మహిళలు చట్టాల పైన, వారి హక్కుల పైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా జడ్జి కవిత అన్నారు, మంగళవారం ఎనిమిదవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం  పురస్కరించుకుని స్థానిక జిల్లా పరిషత్  బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వారి హక్కుల సాధనకై పోరాడాలని, మహిళా సాధికారత దిశగా సాగాలని ఆమె ఆకాంక్షించారు, అనంతరం ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, మహిళలు దిశ యాప్ పై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు, ముఖ్యంగా బాలికలు బాల్య వివాహాల పై జాగ్రత్తగా ఉండాలని, చదువు పట్ల శ్రద్ధ వహించాలని, అలాగే యూటీ జింగ్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండి అలాంటి వారిపై పోలీసుల దృష్టికి తీసుకురావాల నీ ఆయన తెలిపారు, కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్,  భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విజేత మహిళా మండలి అలాగే మండల సమైక్య ( వెలుగు) ఆధ్వర్యంలో ” సంయుక్తంగా 8 వ,  అంతర్జాతీయ మహిళా దినోత్సవం” ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు, ఈ సందర్భంగా మహిళలకు సీమంతాలు, ఎన్జీవోస్ కు సన్మానాలు, చూస్తుంటే నిజంగా ఇక్కడ ఒక పండుగ వాతావరణం కనిపిస్తోందని ఆయన తెలిపారు, స్త్రీ ఒక మాతృమూర్తిగా, ఒక చెల్లిగా, ఒక అక్క గా మగవాడి జీవితం లో సగభాగంగా దేవతలు సైతం స్త్రీ లో సగ భాగ మై ఉండడం గమనార్హం, స్త్రీ లేనిదే జననం లేదు , స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే మనుగడ లేదు,  స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు జగతిలో స్త్రీకి ఉన్నత స్థానం కలదని ఆయన తెలియజేశారు, విజేత మహిళా మండలి అధ్యక్షురాలు గోసుల అరుణకుమారి మండల సమైక్య వెలుగు ఆధ్వర్యంలో ఇంత గొప్పగా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు, సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది, అనంతరం 11 మంది గర్భిణీలకు శ్రీమంతాలు, 14 మంది ఎన్జీవో సన్మానాలు, అలాగే సీనియర్ సిటిజన్స్ ప్రత్యేక సన్మానాలు చేయడం జరిగింది, అలాగే వివిధ రంగాలలో సేవలు చేస్తున్న  మహిళలకు ఉత్తమ సేవా పురస్కారం అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఏ పీ ఎం గంగాధర్, ఏ పీ ఓ, అంగన్వాడి సూపర్వైజర్ గురమ్మ, సచివాలయ సిబ్బంది, సి సి లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

About Author