NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

1 min read

పల్లెవెలుగువెబ్​, చాగలమర్రి: మహిళలు అన్ని రంగాలలో రాణించాలని వాసవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ అన్నా సత్యనారాయణ కోరారు. చాగలమర్రి పట్టణంలోని శ్రీ వాసవి డిగ్రీ కళాశాలలో మంగ్లవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాలలో రాణంచటం హర్షించదగ్గ విషయమన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. అనంతరం గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి ప్రసన్న మాట్లాడుతూ యువతులు,మహిళలు సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ,నిర్బయ,పోక్సా లాంటి అనేక చట్టాలను  తెచ్చిందన్నారు.కార్యక్రమం లో ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త మహేశ్వరయ్య,అధ్యాపాక,అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థినులు పాల్గొన్నారు.

About Author