మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. ఎంపీడీవో విజయసింహారెడ్డి..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల:వివిధ వృత్తి కోర్సుల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు జెఎస్డబ్ల్యు సిమెంట్ పరిశ్రమ ఆధ్వర్యంలో మండల పరిషత్ సమావేశ భవనంలో శనివారం నాడు ఎంపీడీవో విజయసింహారెడ్డి మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వృత్తిలో నైపుణ్యం సాధించిన ప్రతి ఒక్క మహిళ ఆర్థిక స్వలంబన ఏర్పరచుకోవాలని కుటుంబానికి చేదోడుగా ఉంటూ అభివృద్ధి చెందాలని మండలంలో జెఎస్డబ్ల్యు పరిశ్రమ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు వివిధ వృత్తుల శిక్షణ ఇస్తున్నందుకు మహిళలు రుణపడి ఉంటారన్నారు.జెఎస్డబ్ల్యూఎస్ పరిశ్రమ సీఎంఓ వీరబాబు మాట్లాడుతూ పరిశ్రమ స్థాపించినప్పుడు నుంచి మహిళల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు చాలామంది మహిళలు ఇంటి వద్దనే టైలరింగ్ ఏర్పాటు చేసుకొని సొంత కాళ్లపై నిలబడి సంపాదిస్తున్నారని, కాలుష్యకారకమైన ప్లాస్టిక్ నిషేధించడంతో పర్యావరణానికి మేలు చేసే జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కేంద్రాలను కూడా నడుపుతున్నామన్నారు అనంతరం టైలరింగ్ బ్యూటీషియన్ మగ్గం పెయింటింగ్ పచ్చళ్ళు తయారీలో శిక్షణ పూర్తి చేసుకున్న 329 మహిళలకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో ప్లాంటె హెడ్ హుకుం చంద్ గుప్తా. హెచ్ ఆర్ మేనేజర్ వినీత్ కుమార్. సి ఎస్ ఆర మేనేజర్ రవికుమార్. విజయలక్ష్మి భాస్కర్ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.