NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళలు తమ లక్ష్యాలను సాధించేందుకు ధైర్యంగా ముందుకు సాగాలి

1 min read

ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి

మహిళలకు సమాన హక్కులు,సామాజిక ప్రభావం, సాధికారత సాధించేందుకు ధైర్యంగా ముందుకు సాగాలి

జెసి పి.ధాత్రి రెడ్డి

సంస్థకు విశిష్ట సేవల సేవలందించిన మహిళా ఉద్యోగులకు’బెస్ట్ ఉమెన్ ఎంప్లాయ్’ అవార్డుతో సన్మానం

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : సర్ సి ఆర్ రెడ్డి కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడమైనది. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విజయాన్ని సాధించిన మహిళల ప్రతిభను కొనియాడుతూ, మహిళా సాధికారత గురించి చర్చించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి ఐ.ఏ.ఎస్ హాజరై మాట్లాడుతూ మహిళల సమాన హక్కులు, సామాజిక ప్రభావం మరియు వారి సాధికారత గురించి తెలియజేసి మహిళలు తమ లక్ష్యాలను సాధించేందుకు ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. సర్ సి ఆర్ రెడ్డి విద్యాసంస్థల కార్యదర్శి డా. యం.బి.ఎస్.వి.ప్రసాద్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని, సమాజంలోని ప్రతి రంగంలో వారిని ప్రోత్సహించాలనే అవసరం ఉందని తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ డా.కె.ఎస్. విష్ణుమోహన్ మాట్లాడుతూ మహిళలు ఏ రంగంలోనైనా అద్భుత ప్రతిభను కనబరుస్తారని, సమాన అవకాశాలను కల్పించడం ద్వారా వారి ఎదుగుదలకు సహాయపడాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. ఎ. రామరాజు మాట్లాడుతూ విద్యార్థినులు తమ లక్ష్యాలను నిశ్చయించుకుని నిర్భయంగా ముందుకు సాగాలని ప్రేరేపించారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీ కె. విశ్మేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం తమ హక్కుల కోసం పోరాడటం ఎంత ముఖ్యమో వివరించారు. ఐ.క్యూ.ఏ.సి కో-ఆర్డినేటర్ డా.జి. రాము మాట్లాడుతూ మహిళల శక్తి, ఆత్మ విశ్వాసం మరియు కార్యశీలత సమాజ పురోగతికి ఎంతో అవసరమని తెలిపారు. ఉమెన్ ఎంవపవర్మెంట్ సెల్ కో-ఆర్డినేటర్ ఎ. లావణ్య మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమో వివరించారు. మహిళలకు విద్య, ఆర్థిక స్వాలంబన, మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా సమాన హక్కులు పొందే అవకాశముంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బెస్ట్ ఉమెన్ ఎంప్లాయ్ అవార్డ్స్ ను ప్రధానం చేసి సంస్థకు విశేష సేవలందించిన మహిళా ఉద్యోగులను గౌరవించారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author