మహిళా చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి
1 min read– స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ జింకా రెడ్డిశేఖర్
పల్లెవెలుగు వెబ్, రాయచోటి: మహిళలు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని స్పెషల్ జుడీషియల్ మేజిస్ట్రేట్ జింకా రెడ్డి శేఖర్ అన్నారు. ఆదివారం కాటిమాయకుంటలో డ్రాప్స్ ఆధ్వర్యంలో గృహ హింసా చట్టంపై చేపట్టిన న్యాయ శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. అవగాహన లోపం, నిరక్షరాస్యత తో మహిళలు చట్టాలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నారని అన్నారు. న్యాయస్థానాలు మహిళల హక్కులను పరిరక్షించడానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాయని తెలిపారు. కేసు లు పరిష్కారానికి లోక్ అదాలత్ లను, ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం పలు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. డ్రాప్స్ సంస్థ పీ ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు వారి సమస్యలను డ్రాప్స్ సంస్థ దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బాల్య వివాహాలను నిషేధించాలని చెప్పారు. స్థానిక సచివాయల ప్రొటెక్షన్ సెక్రటరీ మహా దేవి దిశా యాప్ ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో డ్రాప్స్ సమన్వయ కర్త ఉమాదేవి, యానిమేటర్ వెంకట రమణ తో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.