మహిళా రచయితలు.. గృహాలకే పరిమితం కారాదు…!
1 min read– రాజ్యసభసభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : నగరంలోని హోటల్ మౌర్య ఇన్ లో ఉన్న పరిణయ ఫంక్షన్ హాల్ లో జనతా పౌండేషన్, గణేష్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ కవయిత్రుల సమ్మేళనం-నారీ స్వరాలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీమ్ అన్ సారియ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శమంతకమణి, ఉమాదేవి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవయిత్రులు రచించిన పుస్తకాలను రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ శ్రీమతి తమిమ్ అన్సారీయ ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ సమాజంలో ముఖ్యంగా మహిళా కవయిత్రుల ప్రతిభ ను బాహ్య ప్రపంచానికి చాటేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. భవిష్యత్తులో కవయిత్రులు, రచయితలకు సంబంధించి పెన్షన్ ఇచ్చే అవకాశాలకు తాను కృషి చేస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లో ఆరు శాఖలకు సంబంధించి స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నానని, తమ పరిధిలో మంజూరు లేకున్నా, సిఫారసు చేసే అవకాశం ఉందని దాని ద్వారా రచయిత్రులకు , కవియిత్రులాకు ఏదైనా సహాయం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమాజంలో మేధావులుగా గుర్తింపు పొందిన కవయిత్రులు గృహాల కే పరిమితం కాకుండా రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో కి ప్రవేశించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులకు అధికంగా శ క్తీ ఉంటుందని మహిళా కవయిత్రులు కూడా రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని సూచించారు. మానవ జీవితాలలో మహిళల పాత్ర వెలకట్టలేని విలువైనదని అని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు.