జిల్లా ట్రెజరీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు..
1 min read– పందిరి ప్రేమావతికి, డి టి ఓ టి.కృష్ణ సత్కారం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఏలూరు జిల్లా జిల్లా ఖజానా శాఖలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గా పనిచేస్తున్న పందిరి ప్రేమావతి గత బుధవారం జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ప్రశంస పత్రం. మెమౌంటో అందుకున్నారు, ఈమె జూనియర్ అసిస్టెంట్ గా ఖజానా శాఖలో ఉద్యోగ బాధ్యతలు ప్రారంభించి. గత 32 సంవత్సరాలుగా తన సేవలను అందిస్తూ నేడు ఏటిఓ గా పందిరి ప్రేమావతి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు 2022 – 2023వ సంవత్సరనికి గాను మార్చి 8వ తేదీ బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ(ఐసిడిఎస్) మరియు ఏపీ ఎన్జీవోస్ సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ప్రేమావతికి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా మెమొంటో అందజేసి శాలువాతో చిరు సత్కారo చేశారు, ఈమె ధైర్యసహసాహతాలతో ఒడిదుడుకులను అధిగమిస్తూ కుటుంబ సభ్యుల సహకారంతో అధికారులకు. సమాజానికి సేవలు అందించి అధికారులు, అనధికారులు రాజకీయ ప్రముఖులు మరియు సహ ఉద్యోగులచే ధీరవనితగా పలువురిచే మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమెకు జిల్లా ట్రెజరీ సహ ఉద్యోగు లందరూ కలిసి అభినందన సభ ఏర్పాటు చేశారు, ప్రేమావతి విభిన్న ప్రతిభావంతురాలు అయినప్పటికీ ఆ ఛాయాలను ఆ విధమైనటువంటి ఆలోచనలను దరిచేరనీయకుండా తన స్వశక్తితో ఉన్నత ఆలోచనలతో ఉద్యోగరీత్యా రాణించటం గర్వించదగ్గ విషయమని తోటి సహ ఉద్యోగ మహిళలు కొనియాడారు. జిల్లా ట్రెజరీ అధికారి టి కృష్ణ మాట్లాడుతూ ఇండిపెండెన్స్ డే నాడు సీనియర్ సహాయ ట్రెజరీ అధికారిగా ఈమె పేరును సిఫార్సు చేయడం జరిగిందని అయితే ప్రేమావతి సున్నితంగా తిరస్కరించారని. కార్యాలయానికి వచ్చే వారి అవసరతలను. పనిని ఎప్పటికప్పుడు పూర్తిచేసి వారికి అందించడంలోనే సంతృప్తి కలుగుతుందని వారు చూపించే కృతజ్ఞతా భావమే ఒక అవార్డు గా ఉంటుందని ఆమె తెలిపారని అన్నారు. కార్యాలయ వర్క్ విషయంలో కష్టం నుంచి పనిచేసి ఎ విధమైనటువంటి పెండింగ్ ఫైల్స్ లేకుండా పనిచేయడం కేవలం ఆమెకే సాధ్యపడిందని అన్నారు. మన ట్రెజరీ కార్యాలయ సిబ్బంది అందరి సహకారంతోటే మన కార్యాలయ పేరు ప్రతిష్టలు జిల్లా వ్యాప్తంగనే కాక రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు రావటం గర్వకారణమని డి టి ఓ అన్నారు. ముందుగా కార్యాలయ మహిళ సిబ్బందికి, ఫైర్ సిబ్బంది వంటగ్యాస్ వినియోగంపై (డెమో) నిర్వహించి వంట చేసేటప్పుడు గ్యాస్ వినియోగం పై తీసుకోవలసిన జాగ్రత్తలను సూచనలను. సలహాలను అందించారు. అనంతరం జిల్లా ట్రెజరీ అధికారి టి కృష్ణ చేతుల మీదుగా ప్రేమావతికి మెమొంటో అందజేసి శాలువా కప్పి సత్కరించారు. జిల్లా ట్రెజరీ జిల్లా సెక్రెటరీ కప్పలప్పల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రేమావతి ఎవరిని నొప్పించకుండా తన పనిని తాను ఎప్పటికప్పుడు ముగించడంలో ముందు వరుసలో ఉంటారని. ఆమె స్ఫూర్తితోనే కార్యాలయంలో సిబ్బంది వర్క్ విషయంలో చురుకుగా పనిచేస్తుంటారని. మనమంతా ఐక్యంతో కార్యాలయ పేరు ప్రతిష్టలను మునుముందు కూడా గుర్తింపు తెచ్చుకునే విధంగా మనమంతా ఐక్యంగా పనిచేయాలని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కార్యాలయంలో పనిచేసే మహిళా సిబ్బందికి ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ చేశారు. ప్రేమావతికి విచ్చేసిన తన సహచర ఉద్యోగులు, అధికారులు. ఆహుతలు హర్షధ్వనాలతో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ఫోటో అండ్ ప్రింట్ మీడియ. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కూడా కరచనాలతో అభినందనలు తెలియజేశారు.