మిడుతూరులో ఘనంగా మహిళా దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మంగళవారం ఉ 11:30 కు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో మహిళా దినోత్సవ కార్యక్రమాలను ముందస్తుగా ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏసీ డిపీ ఓ మంగవల్లి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన మహిళ దినోత్సవం ఉందని కానీ ఆరోజున సెలవు దినం కావడంతో ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని మహిళా దినోత్సవం మరియు బాలికలను రక్షించండి-బాలికలను చదివించండి అనే వాటి పైన ఆమె మాట్లాడారు.అంతే కాకుండా బాలికలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని బాలికలను ప్రతి ఒక్కరినీ చదివించాలని బాలురతో పాటు బాలికలను సమానంగా చూడాలని చిన్న వయసులో బాలికలకు వివాహాలు చేయకూడదని విద్య పరంగా బాలికలకు ప్రభుత్వం ఎంతగానో వారిని ప్రోత్సహిస్తూ ఉందని తల్లిదండ్రులు వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఏసీ డిపిఓ అన్నారు.అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ కోటేశ్వరమ్మ,కస్తూర్బా పాఠశాల ఎస్ఓ విజయలక్ష్మి,అంగన్వాడి సూపర్వైజర్లు వరలక్ష్మి, రేణుకాదేవి,అంగన్వాడీ కార్యకర్తలు మరియు జిఎం ఎస్ కే లు పాల్గొన్నారు.