మహిళల అభివృద్ధి కోసమే చేయూత -మహిళల పక్షపాతి సీఎం జగన్
1 min read-మహిళలకు 5 కోట్ల చెక్కును పంపిణీ చేసిన ధా రా సుధీర్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మహిళల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి జగన్ పథకాలను తీసుకువచ్చారని నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ధార సుధీర్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో మహిళా మండలి పొదుపు సమాఖ్య ప్రాంగణంలో మంగళవారం మ.12 గం.కు ఏర్పాటు చేసిన వైఎస్సార్ చేయూత నాలుగో విడత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధీర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి సుధీర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలను మహిళలకు వెళ్లే విధంగా చేస్తూ ఉన్నందు వల్లే మహిళలు మీ కాళ్ళ మీద మీరు సొంతంగా నిలబడుతూ అభివృద్ధి చెందుతున్నారని అన్నారు.ముఖ్యమంత్రి జగన్ మహిళల పక్షపాతి అని మీకోసం మీపిల్లల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని పథకాల ద్వారా వచ్చే నగదును వృధాగా చేసుకోకుండా వ్యాపారాలతో మీ కుటుంబాలు ఇంకా అభివృద్ధి చెందాలన్నారు.డబ్బులు ఇవ్వడం ద్వారా కొద్దిగా మాత్రమే అభివృద్ధి చెందుతుందని కానీ గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామంలో పిల్లలకు మంచి విద్య ఎంతో అవసరమని ఆ విద్యను అందిస్తూ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని ఆయన అన్నారు.మండలంలో వైఎస్సార్ చేయూత పథకానికి 45-60 సం.ల లోపు 2685 మంది మహిళలకు 5 కోట్ల 3 లక్షల 44 వేల రూపాయల చెక్కును డాక్టర్ దార సుధీర్ జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి మహిళలకు చెక్కును అందజేశారు.అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ, నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు పెద్దమౌలా,వైస్ ఎంపీపీ నబి రసూల్,రామ నాగేశ్వరరెడ్డి, అలగనూరు చిన్న రామచంద్రారెడ్డి,ఏసీ డేగలయ్య, ఏపీఎం సుబ్బయ్య,వెలుగు సీసీలు కృష్ణారెడ్డి శంకరయ్య భాను విఓఏలు మరియు వివిధ గ్రామాల చేయూత లబ్ధిదారులు పాల్గొన్నారు.