NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళల అభివృద్ధే మాఎజెండా -ఎమ్మెల్యే ఆర్థర్ కు ఘన స్వాగతం

1 min read

-ప్రతి మహిళ అభివృద్ధి బాటలో నడవాలి
– మిడుతూరులో మూడవ విడత ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: స్థానిక మండల కేంద్రంలోని మహిళా మండలి సమాఖ్య ప్రాంగణంలోమంగళవారం ఉదయం వెలుగు ఏపిఎం సుబ్బయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడవ విడత వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ హాజరయ్యారు.ముందుగా ఎమ్మెల్యేకు పొదుపు సంఘ మహిళలు పూలతో ఘన స్వాగతం పలికారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ప్రభుత్వ హయాంలో మహిళలకు సముచిత స్థానం కల్పించిన ఘనత ముఖ్యమంత్రిదే నని ప్రతి మహిళ కూడా అభివృద్ధి చెందాలన్నదే మా ఉద్దేశమని రాబోయే రోజుల్లో మీరు ఇంకా మీలో ఉన్నటువంటి నైపుణ్యాల వల్ల అభివృద్ధి చెందుతూ మీకుటుంబాలకు బాసటగా ఉండే విధంగా ఉండాలన్నారు.అంతేకాకుండా గత రెండు సంవత్సరాలుగా పొదుపు సంఘంలో ఉన్న ప్రతి మహిళకు ఆసరా నగదును మీ అకౌంట్లలో జమ చేయడం జరిగిందని అన్నారు.అదేవిధంగా ఇప్పుడు మూడవ విడత ఆసరా నగదును 5960 మంది మహిళలకు మీ అకౌంట్లలో జమ చేయడం జరుగుతూ ఉందని అన్నారు.తర్వాత మహిళలకు 3 కోట్ల 21లక్ష 53 వేల 175 రూపాయల చెక్కును మహిళలకు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి మహిళలతో కలిసి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ షుకూర్, నందికొట్కూరు రూరల్ సిఐ జి సుధాకర్ రెడ్డి,ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,ఈఓఆర్డి ఫక్రుద్దీన్,రైతు సంఘం నాయకులు వంగాల సిద్ధారెడ్డి, ఎస్సై మారుతి శంకర్,ఎంఎంఎస్ అధ్యక్షులు శ్యామలమ్మ,చౌటుకూరు సర్పంచ్ మదర్ సాహెబ్, వివిధ గ్రామాల నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,సాదిక్,ఇ నాయతుల్ల,వెంకట్,వెలుగు సీసీలు శంకరయ్య,కృష్ణారెడ్డి, భాను,విఓఏ లు మరియు వివిధ గ్రామాల పొదుపు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author