స్త్రీ స్వశక్తికి,సాధికారత శక్తిని చాటే దిశగా టిడిపి పార్టీ పెద్దపీట వేస్తోంది
1 min read
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య
మహిళలు రాజకీయాల్లో మరింతగా రాణించే దిశగా అడుగులు
నాడు నందమూరి తారక రామారావు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : తెలుగునాట ప్రతి స్త్రీ తనశక్తిని చాటి, సాధికారతను సాధించే దిశగా తెలుగుదేశం పార్టీ తొలినుండీ పెద్దపీట వేస్తూ వస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఇదేఅంశంపై మాట్లాడారు. తమ ఇంటిని సమర్థవంతంగా తీర్చిదిద్దే శక్తివంతులైన మహిళలు రాజకీయాల్లోనూ మరింత రాణించే విధంగా అక్కడ సైతం వారు తమ సత్తా చాటే విధంగా టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు కృషిచేశారని, మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనతను సొంతం ఆయన చేసుకున్నారని కొనియాడారు. దానికి కొనసాగింపుగా ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా గతంలో మహిళల ఆర్ధిక స్వావలంబనే ధ్యేయంగా డ్వాక్రా పథకానికి ఆయన శ్రీకారం చుట్టారని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి ఎంతో మంది మహిళల జీవన ప్రమాణాలను పెంచిన ఘనతను ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతం చేసుకున్నారన్నారు. మహిళల పేరుమీద ఇళ్లపట్టాలు, ఇంటి నిర్మాణం, భూమి కొనుగోలు వంటి పథకాలెన్నో ఆచరణాత్మకంగా అమలు చేసి చూపించారన్న ఎమ్మెల్యే చంటి అన్నారు.ఇది నభూతో నభవిష్యత్తేనని తేల్చిచెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం ఎన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా మహిళా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2025 – 26 సంవత్సరానికిగాను 3లక్షల 22వేల 359 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఏపి శాసన సభలో ప్రవేశపెడితే, అందులో మహిళా, శిశు సంక్షేమానికే 4వేల 332 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించడం జరిగిందన్నారు. దీంతో రాష్ట్ర బడ్జెట్‌ను మహిళా పక్షపాతి బడ్జెట్‌గా అనేక మంది అభివర్ణిస్తున్నారన్నారు. మహిళల సంక్షేమానికి, ఆర్ధిక పరిపుష్టికి తోడ్పాటునందించేందుకు ఈ బడ్జెట్ ఎంతో దోహదమని ఆయన స్పష్టం చేశారు. 2019 – 24 మధ్యకాలంలో అప్పటి వైసిపి ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని, రక్షణను గాలికొదిలేసిందని మండిపడిన ఎమ్మెల్యే బడేటి చంటి మహిళాభ్యున్నతికి కూటమి ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఆయనకెక్కడిదంటూ సూటిగా ప్రశ్నించారు. మహిళలను దగా చేసిన మాజీ సీఎం జగన్ రెడ్డి, తన తల్లీ, చెల్లిని కూడా ఎంతో ఘోరంగా అవమానించారని గుర్తుచేశారు. మహిళలను ఉచితాల పేరుతో మోసగించిన సైకో జగన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో మహిళలే తగిన బుద్దిచెప్పారని, ఇప్పటికైనా మారకుంటే ఆయనకు మరింత భంగపాటు తప్పదంటూ ఎమ్మెల్యే చంటి ఘాటు విమర్శించారు. రానున్న కాలంలో మహిళలకు మరిన్ని మేళ్ళు చేకూర్చే బాధ్యతను కూటమి ప్రభుత్వాధినేతలు అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కర్తవ్యసహితులై, సంకల్పోచితంగా నిరంతరం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చంటి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.