NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం

1 min read

ధ్రువపత్రం అందించిన రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరం అవసరమైన కోటాకు మించి ఓట్లు సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సోమ, మంగళ వారాల్లో స్ధానిక సర్. సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల పరిశీలకులు శ్రీధర్, రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్ అభ్యర్ధులు వారి ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు.  28 టేబుళ్లపై సోమవారం ఉదయం 8.00 గంటల కు ప్రారంభించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటకు పూర్తయింది.ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన 2,18,997 ఓట్ల లెక్కింపులో 19,789 చెల్లని ఓట్లు పోను మిగిలిన 1,99,208 వ్యాలీడ్ ఓట్లలో పేరా బత్తుల రాజశేఖరం కు 1,24,702 ఓట్లు లభించాయి.  ఈ ఎన్నికల్లో పోటీచేసిన పిడిఎఫ్ అభ్యర్ధి దిడ్ల వీర రాఘవులుకు 47,241 ఓట్లు, జి.వి. సుందర్ కు 16,183 ఓట్లు లభించాయి. మొత్తం 8 రౌండ్లలో 1,24,702 ఓట్లతో పేరాబత్తుల రాజశేఖరం సాధించారు. పేరాబత్తుల రాజశేఖరం డిటైల్ తొలి కౌంటింగ్ లోనే 1,24,702 ఓట్లు లభించడంతో ఎన్నికల కమీషన్ ఆమోదంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి  తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి  పేరాబత్తుల రాజశేఖరం కు  ధృవపత్రాన్ని అందజేశారు.  కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అడిషనల్ ఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు,డిఎస్పీ శ్రావణ కుమార్ సమర్థవంతంగా  భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కు మొదటి రౌండులో 16,520, రెండవ రౌండులో 16,212, 3వ రౌండ్ లో 16,191, 4వ రౌండ్ లో 15,482, 5వరౌండ్ లో 15,632, 6వ రౌండ్ లో 16,254, ఏడవ రౌండ్ లో 16,040, 8వ రౌండ్ లో 12,371, మొత్తం 1,24,702 ఓట్లు లభించాయి.పి డి ఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుకు మొదటి రౌండులో 5,815, రెండవ రౌండులో 5,421, 3వ రౌండ్ లో 5,570, 4వ రౌండ్ లో 6,446, 5వరౌండ్ లో 6,413, 6వ రౌండ్ లో 5,949, ఏడవ రౌండ్ లో 5,654, 8వ రౌండ్ లో 5,973 మొత్తం 47,241 ఓట్లు లభించాయి. జి.వి. సుందర్ కు మొదటి రౌండులో 1,968, రెండవ రౌండులో 2,238, 3వ రౌండ్ లో 2,119, 4వ రౌండ్ లో 2,484, 5వరౌండ్ లో 2,208, 6వ రౌండ్ లో 1,741, ఏడవ రౌండ్ లో 2,106, 8వ రౌండ్ లో 1,319 మొత్తం 16,183 ఓట్లు లభించారు.ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులకు పోలైన ఓట్ల వివరాలు..పేరాబత్తుల రాజశేఖరం 1,24.702,కాట్రు నాగబాబు 565షేక్ హుస్సేన్ 394,కట్టా వేణుగోపాల కృష్ణ(వేగోకట్టా),            1,017కాండ్రేగుల నరసింహం           364,     కాళ్ళూరి కృష్ణమోహన్ 190,కుక్కుల గోవిందరాజు          269,కునుకు హేమకుమారి 956            కైల లావణ్య          365,గౌతం బాబు కొల్లు      317,చిక్కాల దుర్గారావు,     665 తాళ్లూరి రమేష్,          201దత్తాత్రేయ నోరి,            567దిడ్ల వీర రాఘవులు(డి.వి. రాఘవులు),      47,241దొరబాబు యాళ్ల,   303నీతిపూడి సత్యనారాయణ,          161పినిపే నాగభూషణ వర్మ 68, పిప్పళ్ళ సుప్రజ 479,పేపకాయల రాజేంధ్ర(శుభ)            199,     బొడ్డు శ్రీనివాసరావు 152,బొమ్మనబోయిన వి.ఎస్.ఆర్. మూర్తి            119,బొమ్మిడి సన్నీరాజ్      398,బండారు రామమోహన్ రావు 709,భీమేశ్వరరావు చిక్క 254, మాకి దేవీప్రసాద్ ,146 మెర్ల శాస్త్రులు 103,మోకన అంబేద్కర్       129,     రాజపూడి 95, జి.టి. రామారావు        39,రేవులగడ్డ ముఖేష్ బాబు 96        ,వానపల్లి శివగణేష్ 772,శ్రీనివాస్ విష్ణువఝల          190      ,యం. శ్రీనివాసరావు(యం.ఎస్.ఆర్)  41,జి.వి. సుందర్ 16,183, హాసన్ షరీప్ లకు 759 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో పాల్గొన్న అధికారులకు పోటీ అభ్యర్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *