NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ కంపెనీలో ప‌ర్మనెంట్ గా వ‌ర్క్ ఫ్రమ్ హోమ్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని లింక్డ్ ఇన్ సంస్థ కీల‌క నిర్ణయం తీసుకుంది. ఇక పై త‌మ ఉద్యోగులు వ‌ర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవ‌కాశం క‌ల్పించింది. అవ‌స‌ర‌మైతే పార్ట్ టైమ్ ఆఫీసుకు వ‌చ్చే అవ‌కాశం క‌ల్పించింది. ప్రపంచ వ్యాప్తంగా సంస్థలో ప‌నిచేస్తున్న 16000 మంది ఉద్యోగుల‌కు ఈ నిబంధ‌న వ‌ర్తిస్తుంది. కొన్ని ప‌నులు ఆఫీసుకు వ‌స్తే కానీ పూర్తీ చేయ‌లేము.. అలాంటి వారికి ఖ‌చ్చితంగా ఆఫీసుకు రావాల‌ని స్పష్టం చేసింది. కొత్త నిబంధ‌న‌కు అనుగుణంగా ఉద్యోగులు త‌మ నివాస‌ స్థలాన్ని మారిస్తే ఆ ప్రాంతానికి అనుగుణంగా వేత‌నాల్లో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది.

About Author