NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి కార్మికుడు కష్టపడాలి

1 min read

ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు బతకన్న

పల్లెవెలుగు వెబ్ కర్నూల్: రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్క కార్మికులు కష్టపడాలని ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు బతకన్న పిలుపునిచ్చారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కే బాబురావు ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకన్న మాట్లాడుతూ రానున్న రోజులు చాలా విలువైనవి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందన్నారు. అందుకే ఇండియా కూటమి గెలుపు కోసం ఐ ఎన్ టి యు సి ఉన్నందు పోరాడుతుందన్నారు. వచ్చే నెల మే ఒకటో తారీకు మేడే పండుగ ను కార్మికుల మందిరం కలిసి ఘనంగా జరుపుకోవాలన్నారు.ఐ ఎన్ టి యు సి ఉపాధ్యక్షుడు కన్నయ్య  మాట్లాడుతూ మన సంఘాలన్నీ ఐకమత్తంతోనే ఉండాలని కోరారు. కర్నూల్ నియోజకవర్గం ఇన్చార్జి ఐఎన్టిసి అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ మేడే మనమందరము ఘనంగా జరుపుకోవాలని కోరాడు. కోడుమూరు ఇన్చార్జి ప్రతాప్ మాట్లాడుతూ కోడుమూరులో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఎవరికీ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని తీరుతామని అన్నారు .సమన్వయ కమిటీ అధ్యక్షుడు అనంతరత్నం మాట్లాడుతూ ఐఎన్టియుసి కాంగ్రెస్ పార్టీకి ఒక అనుబంధ సంస్థ అన్నాడు .ఈ సమావేశానికి కే ఆనందం, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి కే మహేష్ , ఐఎన్టీయూసీ సెక్రెటరీ భవన కార్మికుల అధ్యక్షుడు బి హుస్సేన్ ఫోటో స్టూడియో అధ్యక్షుడు ఆర్ రాముడు భవన కార్మికుల ఉపాధ్యాయుడు దేవరాజు,భవన కార్మిక నాయకుడు పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జి సాంబ ,పేపర్ మిల్లు కార్మికులు ఇంకా అనేక మంది కార్మికులు హాజరైయారు.

About Author