సమన్వయంతో పనిచేయాలి
1 min read– ఎంపీడీవో సురేష్ బాబు, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల గ్రామ వాలంటీర్లు- అదేవిధంగా గ్రామ సచివాలయ సిబ్బంది సమన్వయంతో పని చేసినప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు అన్నారు. చెన్నూరు టౌన్ లోని 1 వ సచివాలయం సిబ్బంది కి అలాగే గ్రామ వాలంటీర్లకు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ ఎంపీడీఓ సురేష్ బాబు అలాగే పంచాయతీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ఒక వారధి లాగా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్క లబ్దిదారునికి చేరే విధంగా వారు చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు, అలా చేయకుండా విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వము వహిస్తే సహించేది లేదని వారు వాలంటీర్లకు గ్రామ సచివాలయం సిబ్బందికి చెప్పడం జరిగింది, అలాగే ప్రతి 50 ఇండ్లకు సంబంధించి ఒక వాలంటీర్ ఉన్నాడు కాబట్టి, ఆ 50 ఇండ్లకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే వాటిని గ్రామ సచివాలయ సిబ్బందికి తెలియజేసి పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు, అదేవిధంగా గ్రామ సచివాలయ సిబ్బంది కూడా వాలంటీర్లు తీసుకువచ్చిన ప్రజా సమస్యలను పరిశీలించి వాటిని సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు, అంతేకాకుండా గ్రామ సచివాలయాలలోకి వచ్చే ప్రజలకు తమ సహకారం అందించి, వారు తీసుకు వచ్చిన సమస్యను విని వారికి ఆ సమస్య కు సంబంధించిన పరిష్కారం చూపించాలని తెలియజేశారు, మనం ప్రజలకు ఎంత సర్వీస్ అందిస్తామో, ప్రజలు కూడా ప్రభుత్వానికి అంత అండగా నిలబడతారని వారు తెలిపారు, కాబట్టి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించాలని వారు ఈ సందర్భంగా కోరారు.