PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు పనిచేయాలి : ఎస్పీ

1 min read

– జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి.

– పోలీసుల మైంటైన్ చేసే ప్రతి రికార్డును ప్రత్యేక దృష్టితో పరిశీలన..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా ఎస్పీ  డి మేరీ ప్రశాంతి ఐపీఎస్  బుధవారం జంగారెడ్డి గూడెం పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసినారు.జిల్లా ఎస్పీ  ముందుగా స్టేషన్ ప్రాంగణం అంతా పరిశీలన చేసి స్టేషన్ ప్రాంగణాలతో పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు తగిన సూచనలను చేశారు.గంజాయి కేసులలో ఉన్న ముద్దాయిలపై సస్పెక్ట్ షీట్ లను ఓపెన్ చేయాలని అలాగే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న రౌడీషీటర్ల యొక్క వివరాలను గురించి, స్పీడ్ ట్రయల్ కేసులలో  వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకుని సదరు విషయాలలో తగిన సూచనలు సలహాలు మరియు ఆదేశాలను ఇచ్చారు.సైబర్ నేరాల,  లోన్ యాప్ వలన జరిగే  మోసాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని, పోలీసుస్టేషన్ నిర్వహణ మరియు రికార్డుల నిర్వహణపై లోతుగా పరిశీలించారు. రిసెప్సన్ సెంటర్, లాకప్ గదులను పరిశీలించి పోలీసు స్టేషన్లకు వచ్చే పిటీషనర్ల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, అనవసరంగా ఎవర్నీ పోలీసు స్టేషన్లకు పిలిపించడం చేయరాదని సూచించారు.విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే ప్రతీ రికార్డును సమీక్షించారు. అనంతరం పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లోని పరిస్థితులను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక నిఘా వేయాలన్నారు. తెలంగాణ లిక్కర్ జిల్లాలోకి ప్రవేశించకుండా చర్యలు ఉండాలి. ఇసుక… గుట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, నాటు సారా తయారీ & అమ్మకం తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పని చేయాలన్నారు. అన్ని ముఖ్యమైన ప్రాంతాలలోనూ దుకాణాల వద్ద దేవాలయాల వద్ద సి.సి కెమేరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ  ప్రత్యేకంగా మాట్లాడి వారి యొక్క సమస్యలను గురించి అడిగి తెలుసుకుని తక్షణమే సదరు ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సిబ్బందికి తగిన సూచనలు మరియు ఆదేశాలను ఇచ్చారు. అనంతరం జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ యొక్క కార్యాలయాన్ని కూడా జిల్లా ఎస్పీ  పరిశీలన చేశారు.

About Author