PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలల హక్కులను పరిరక్షించే విదంగా పని చేయాలి

1 min read

చైల్డ్ రైట్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శాఖల అధికారులతో కన్వెర్జెన్సీ మీటింగ్..

బాలల స్నేహపూరిత గ్రామాలుగా జిల్లాను నిర్మించాలి..

రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుల ఆదేశాలు..

బాలల గురించి గ్రామస్థాయి నుండి అవగాహన సదస్సులు నిర్వహించాలి..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్థానిక అంబికా ఫ్లెవర్స్  మీటింగ్ హల్ నందు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారి వారి అధ్యక్షతన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మరియు చైల్డ్ రైట్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వివిధ శాఖ అధికారులతో కన్వర్జెన్సీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా UNCR  ఓడంబడిక తీర్మానాన్ని అనుసరించి భారత రాజ్యాంగంలో పొందపరచబడిన హక్కులు రాష్ట్రంలో ఉన్న బాలలకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా బాలలకు సంబంధించిన రక్షణ మరియు సంరక్షణ చట్టం 2015 బాల్య వివాహం నిషేధ చట్టం మరియు బాలల లైంగిక వేధింపుల చట్టం అమలు తీరును సమీక్షించడం క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరును పరిశీలించడం, అదేవిదంగా బడి మానివేసిన బాలలను గుర్తించడం, బడి బయట ఉన్న బాలలను తిరిగి బడిలో చేర్పించే విధంగా ప్రతి అధికారి సమన్వయంతో పనిచేస్తూ బాలల హక్కులను పరిరక్షించే విదంగా పని చేయాలను తెలియజేసినరు.అదేవిధంగా పాఠశాల స్థాయిలో బాలలకు చెడు స్పర్శ , మంచి స్పర్శపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు బాలలకు సంబంధించి చైల్డ్ హెల్ప్ లైన్ 1098 అలాగే 181, 100 అదేవిధంగా [email protected] మరియు జిల్లా సంరక్షణ విభాగంలకు సమాచారం అందించిన ఎడల బాలలకు ఎదురయ్య సమస్యలను పరిష్కరించడం అవకాశం ఉంటుందని తెలియజేసినారు. అలాగే గ్రామస్థాయిలో వార్డు మరియు గ్రామ సచివాలయాల్లో ప్రజలకు బాలల హక్కులు మరియు చట్టాలను గురించి అవగాహన కల్పించాలని తెలియజేసినారు.అదేవిధంగా ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు బాలలతో స్నేహపూరితంగా మెలగాలని బాలల రక్షణ మరియు సంరక్షణ చట్టం ప్రకారం ప్రతి పాఠశాల నందు బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయా శాఖ అధికారులకు సూచనలను సలహాలను ఇవ్వడం అయినది. అలాగే బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తరపున చర్యలు తీసుకుంటామని తెలియజేసినారు.బాల్య వివాహ నిషేధ రహిత మరియు బాల కార్మికుల బాల కార్మికుల వ్యవస్థ లేని ఆంధ్రప్రదేశ్ ను  నిర్మించే దిశగా గ్రామ గ్రామాన బాలల స్నేహపూరిత గ్రామాలుగా నిర్వహణ కు చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ వారు బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వారికి వివిధ శాఖ అధికారులు సహకరించి ప్రతి గ్రామాన సంరక్షణ కమిటీలను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని తెలియజేసినారు. తదుపరి రాష్ట్ర  బాలల హక్కుల కమిషన్ సభ్యులు అయిన బత్తుల పద్మావతి మరియు డాక్టర్ జె.రాజేంద్రప్రసాద్  స్థానిక విద్యానగర్ నందు ఉన్న శిశు గృహను సందర్శించి శిశు గృహ నిర్వహణ ఏ విధంగా జరుగుతుందనే విషయాలను శిశు గృహ మేనేజర్ ను కె.భార్గవి ని అడిగి తెలుసుకునరు. అలాగే రికార్డులను పరిశీలించి కమిషన్ సభ్యులు సంతృప్తి వ్యక్తపరిచినారు. కమిషన్ సభ్యులు ఇక్కడ బాలలందరూ కుటుంబ వాతావరణంలో పెరుగుతున్నట్లు కొనియాడినారు. తదుపరి రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు స్థానిక జిల్లా బాలల సంరక్షణ యూనిట్ కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయం నందు నిర్వహిస్తున్న  కార్యక్రమాలను గురించి జిల్లా బాలల సంరక్షణ అధికారి అయిన డాక్టర్ సిహెచ్ సూర్య చక్రివేణి ని అడిగి తెలుసుకుని, అదేవిధంగా బాలల పట్ల తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల సంతృప్తి వ్యక్తపరుస్తూ ఇకమీదట కూడా బాలల గురించి గ్రామస్థాయి నుండి  అవగాహన సదస్సులను నిర్వహించడం ద్వారా అందరికీ బాలల హక్కులను మరియు చట్టాలను కాపాడి మంచి భవిష్యత్తు అందించడానికి అవకాశం ఉంటున్నట్లు తెలియజేసినారు.ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు బి పద్మావతి మరియు డాక్టర్ జె రాజేంద్రప్రసాద్  అదేవిధంగా అడిషనల్ ఎస్పీ ఎన్ఎస్ఎస్ శంకర్, జిల్లా రెవెన్యూ ఆఫీసర్ జిల్లా ఎం వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ డిప్యూటీ CEO  జ్యోతి , మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారత  అదికారి అయిన కే ఏ వి ఎల్ పద్మావతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్ర వేణి, బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ బి రెబ్కా రాణి,  జయా ప్రకాష్ జాయింట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్, క్రాఫ్ట్ డైరెక్టర్ పి ఫ్రాన్సిస్ తంబి , మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి  బి.జ్యోతి , బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్  నాగ రాణి,  ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్,  లేబర్ డిపార్ట్మెంట్  జి.నాగేశ్వర రావు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ CDPOలు మరియు MPDOలు, DLPOలు, హాస్టల్ వెల్ఫేర్ మరియు సోషల్ వెల్ఫేర్ అదికారులు, ICDS సూపర్ వైజెర్లు, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ పి.ఓ.ఎన్.ఐ.సి ఆర్ రాజేష్, పి.ఓ.ఐ.సి సిహెచ్ శ్రీకాంత్  మరియు బాలస్వామి, సునీత, రాజకుమార్,  చైల్డ్ హెల్ప్ లైన్ కో-ఆర్డినేటర్ వైవి రాజు  తదితరులు పాల్గొన్నారు.

About Author