ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
1 min readసచివాలయం సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలి.
రెండో వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసిన వార్డు కౌన్సిలర్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ లోని రెండో వార్డులో ఉన్న సచివాలయాన్ని శనివారం వార్డు కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుస్సేన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం లో విధులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించి వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బంది తో మాట్లాడుతూ వార్డు ప్రజల పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తూ విధులు నిర్వహించాలని అన్నారు. రెండవ వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. సచివాల సిబ్బంది, వాలంటీర్లు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని రేషన్ కార్డ్,ఆధార్ కార్డ్, పింఛన్, ప్రభుత్వం చే ఆమోదించబడిన సర్టిఫికెట్లు ఇంకా ఇతర సమస్యలను తెలుసుకొని వాటిని త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతిరోజు వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకొని తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వారి ఇంటి వద్దనే సమస్యలను తీర్చడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిందని, సచివాలయ అధికారులు వాలంటీర్లు బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని కోరారు. తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ వాలంటీర్స్, వార్డ్ ఇంచార్జి ముజీఫ్, వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కో- కన్వీనర్ పసుల శ్రీనివాసులు నాయుడు తదిరులు పాల్గొన్నారు.