4 లేబర్ కోడ్లను రద్దు చేసేవరకు కార్మికులు పోరాటాలకు సిద్ధం అవ్వాలి..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లకు కుదించి అమలు చేయబోతున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా వామపక్షాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీపీఎం సిపిఐ కాంగ్రెస్ మండల కార్యదర్శి లు వెంకటేష్ మరెప్ప అమనుల్లా మాట్లాడుతు వివిధ కార్మిక వర్గాలు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, పార్లమెంట్ లో ఆమోదించుకొని ఎప్పుడైనా అమలు చేస్తామని సాంకేతాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి చెబుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. సిఐటియు మండల కార్యదర్శి నాగరాజు సమిహుల్లా బాషా పరుశురామ్.హమాలి సలీమ్ కురువ ఈరన్న పాల్గొన్నారు.