ఎక్కడ ఉన్న కార్మికులు అక్కడే విధులు కొనసాగించాలి: ఎంపీ
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: చాలా కాలం నుంచి పారిశుద్ధ కార్మికులుగా వెంకటరమణ కాలనీలో పనిచేస్తున్న మమ్మల్ని వేరే దూర ప్రాంతాలకు మమ్మల్ని వెళ్లమంటున్నారని ఎంపీ సంజీవ్ కుమార్ గారికి విన్నవించుకున్న పరిశుద్ధ మహిళా కార్మికులు, కర్నూలు ఎంపీ కార్యాలయంలో మేము చాలా ఏళ్లగా ఇక్కడ పరిశుద్ధ పనులు చేస్తున్నామని కరోనా సమయంలో కూడా పనిచేశామని ఇప్పుడు మమ్మల్ని వేరే దూర ప్రాంతానికి వెళ్ళమని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని మాకు వచ్చే జీతాల్లో ఆటో చార్జీలు పెట్టుకుని దూర ప్రాంతాల్లో పని చేయలేమని తెలిపారు.. ఈ సందర్భంగా ఎంపి మున్సిపాలిటీ కమిషనర్ భార్గవ్ తేజ్ IAS కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్న కార్మికులను అక్కడే విధులు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా అవసరమైతే అక్కడ కొత్తవారిని నియమించాలని ఎంపీ గారు కోరారు. దీనికి కమిషనర్ గారు స్పందిస్తూ ఈ సమస్య త్వరలో పరిష్కారం చేస్తామని ఎంపీ గారికి హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో పారిశుద్ధ మహిళ కార్మికులు YSRTUC,CITUC యూనియన్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.