NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్మికుల క్షేమం పట్టదా..!

1 min read

– ఉపాధి కూలీలకు మాస్క్​లు, శానిటైజర్​ కూడా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
పల్లెవెలుగు వెబ్​, ఆదోని రూరల్​ : కరోనా కష్ట కాలంలో పనులు లేక వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి డి. రామాంజనేయులు ఆరోపించారు. ఆదోని మండలం కుప్పగల్లు గ్రామంలో ఉపాధి పనుల ప్రదేశాలను వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయిని అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉపాధి కూలీల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉపాధి కూలీలకు మాస్క్​, శానిటైజర్​ ఇవ్వలేదని విమర్శించారు. కరోనా కాలంలో ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు 18 రకాల నిత్యావసర సరుకుల అందించాలని, కరోనా కాలంలో కొలతలతో నిమిత్తం లేకుండా రోజుకు వేతనం 600 రూపాయలు ,200 రోజులు ప్రతి కుటుంబానికి పనులు కల్పించాలని ప్రభ్యత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్ ,ఉపాధి కూలీలు మహేష్ ,అంజనయ్య ,నారాయణ ,ప్రకాష్ ,లక్ష్మీ, రంగమ్మ, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author