PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మత్స్యకారుల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

1 min read

– ఎమ్మెల్యే సమక్షంలో 100 కుటుంబాలు చేరిక

పల్లెవెలుగు వెబ్​  చెన్నూరు  మత్స్యకారుల కుటుంబాలకు అండగా ఉంటానని, వారి సమస్యలను పరిష్కరించే విధంగా చూడడం జరుగుతుందని కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, చెన్నూరు బెస్త కాలనీలో  ఆదివారం సాయంత్రం బెస్త కాలనీకి సంబంధించిన 150 మంది మత్స్యకారులు వైయస్సార్ సిపి పార్టీ లో చేరారు, వీరందరికీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పార్టీ కండువా కప్పి  సాధారంగా ఆహ్వానించారు,, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను చేపట్టడం జరిగిందన్నారు, అంతేకాకుండా వరదలు, ఉప్పెనలు ముంచెత్తినప్పుడు మత్స్యకారులు ఎన్ని రోజులు అయితే బయటకు వెళ్లకుండా ఉంటారో అన్ని రోజులు కూడా ప్రభుత్వం వారికి అండగా నిలబడి చేయూత నివ్వడం జరుగుతుందన్నారు, అదేవిధంగా మత్స్యకారులు సొసైటీలు ఏర్పాటు చేసుకొని ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రభుత్వం వారికి అండగా నిలబడి, సబ్సిడీ రూపంలో రుణాలు అందించడం జరుగుతుందన్నారు, దీని ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి పొందడమే కాకుండా ఆయా కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందన్నారు, దీంతో ఆయా కుటుంబాలలో పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి, ఒక మంచి ఉన్నత  స్థానంలో నిలబడి ఆయా కుటుంబాలకు అండగా ఉండడం జరుగుతుందన్నారు, ప్రభుత్వానికి మీరెంత అండగా నిలబడతారో, ప్రభుత్వం కూడా నీకు అంత అండగా నిలబడి మీ అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆయన అన్నారు,, వైయస్సార్సీపి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెస్త కాలనీ కి అనేక పర్యాయాలు రావడం జరిగిందన్నారు, ఇక్కడి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం జరిగిందన్నారు, డ్రైనేజీ సమస్యలు, అదేవిధంగా సిమెంట్ రోడ్లు, నేషనల్ హైవే కి సంబంధించిన సర్వీస్ రోడ్డు పనులు చేయించడం జరిగిందన్నారు, ఇంకా భవిష్యత్తులో బెస్త కాలనీ కి సంబంధించి అన్ని పనులు నెరవేర్చడం జరుగుతుందన్నారు, అనంతరం మత్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు మల్లె నారాయణస్వామి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది, పాత కడప చెరువు, అలాగే పెన్నా నది కి సంబంధించిన సమస్యలను ఆయన ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది, మళ్లీ నారాయణస్వామి చెప్పిన సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే, సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది, పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ మొదటి నుండి, చేపలు పట్టడం తమ వృత్తిగా ఉందని, మాకు ఎలాంటి స్థిర చరాస్తులు లేవని అలాంటిది కొంతమంది మా వృత్తికి అడ్డు రావడం జరుగుతున్నదని దానిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు, దీనికి సంబంధించి రాష్ట్ర మత్స్యకారుల సంఘం డైరెక్టర్ తెలుగు పులి వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ, గతంలో మత్స్యకారుల సమస్యల పై దివంగత కార్పొరేటర్ బోలా పద్మావతమ్మ పోరాడే వారని, అలాంటి సమస్యలు తలెత్తకుండా ఆమె స్థానంలో నేను మీ సమస్యలన్నిటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని ఆమె హామీ ఇచ్చారు, అనంతరం జిల్లా మత్స్యకారుల సంగం అధ్యక్షుడు మల్లె నారాయణస్వామి ఆధ్వర్యంలో 150 మంది మత్స్యకారుల కుటుంబాలు వైయస్సార్ సిపి పార్టీ లో చేరాయి,,, ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి ఎన్, భాస్కర్ రెడ్డి, వైయస్సార్సీపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి, జెడ్ పి టి సి ముది రెడ్డి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పెడబల్లి ప్రతాపరెడ్డి, బోలా వెంకటసుబ్బయ్య, బోలా రవి, బోలా సుధా, చామంచి శివశంకర్ , బోల సుబ్బరాయుడు , మామిళ్ల నడిపన్న, మహిళ పెద్ద వెంకటేష్, వైయస్సార్సీపి క మలాపురం నియోజకవర్గ  మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష కడప మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గొర్ల పుల్లయ్య గారి ఓబుల్ రెడ్డి( చిన్న బాబు) ఆకుల చలపతి బాబు, ఎంపీటీసీలు, ముది  రెడ్డి సుబ్బారెడ్డి ,సాధిక్ అలీ, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, దుంప నాగిరెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ వారిష్, జుమన్, హస్రత్, టి ఎన్, చంద్రారెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author