జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
1 min readఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కె శ్రీనివాసరెడ్డి..
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : నిరంతరం ప్రభుత్వానికి ప్రజలకు వారాధిలా పనిచేసే జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐ జె యు) ప్రెసిడెంట్ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల ఐ జే యు ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీనివాసరెడ్డి ని ఈ సందర్భంగా ఏ.పి.యు.డబ్ల్యూ. జే యూనియన్ దెందులూరు నియోజకవర్గ ప్రెసిడెంట్ కొత్తపల్లివంశీకుమార్,నాయకులు రెడ్డివెంకటనాయుడు.చాట్ల నరేష్.సున్న సుధీర్.మర్రపు రవి.మనేల్లి రంగారావులు శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా విజయవాడ హోటల్ ఐలా పురంలో కలిసి శాలువా కప్పి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియచేసి సత్కరించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వ ఆదేశానుసారం మనమంతా నిబద్ధతతో సైనికుల్లా పనిచేసి యూనియన్ బలోపేతానికి, అభివృద్ధికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు,ఇటీవల నూతనంగా ఎన్నికైన ఏ పి యు డబ్ల్యూ జే దెందులూరు నియోజకవర్గ ప్రెసిడెంట్ వంశీకుమారును మండల స్థాయి నాత్వకాన్ని బలోపేతం చేసి వారికి అన్ని విషయాలలో వెన్నంటి ముందుండి నడిపించాలని సూచించారు, విచ్చేసిన నాయకులను కె శ్రీనివాసరెడ్డి అభినందించి ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.