PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవ అక్రమ రవాణాపై వర్క్ షాప్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడి ఆదేశాల మేరకు,  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి  బాండెడ్ లేబర్ మరియు మానవ అక్రమ రవాణాపై వర్క్ షాప్ వివిధ సంబంధిత శాఖల సమన్వయంతో న్యాయ సేవ సదన్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి గారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 (1) మనుషుల అక్రమ రవాణాను మరియు బలవంతపు పనిని నిషేధించిందని తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ శ్రీ వెంకట హరినాధ్ మాట్టాడుతు ఆర్టికల్ 24 ప్రకారం ఫ్యాక్టరీలలో పిల్లలను పనిలో నియమించడం నిషేదమని తెలిపారు .శ్రీ వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ కమీషనర్ అఫ్ లేబర్, కర్నూల్ వారు బాండెడ్ లేబర్ గుర్తింపు మరియు రెస్క్యూ ప్రక్రియ గురించి వివరించారు. దిశ పోలీస్ డీ. ఎస్. పి. శ్రీనివాస చారి   భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 370 అక్రమ రవాణా, క్రిమినల్ లా (సవరణ) చట్టం 2013 సెక్షన్ 370 IPC సవరణ అక్రమ రవాణా నేరాన్ని గురించి తెలియజేశారు. ఉమెన్ మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ శారద  బడుగు బలహీన వర్గాల ప్రజల బాండెడ్ లేబర్ నిర్మూలన కోసం ఒక చట్టం 9 ఫిబ్రవరి 1976 అమలులోకి వచ్చిందని తెలిపారు.అనంతరం  వెట్టి చాకిరీ నిర్ములన పోస్టర్లను విడుదల చేసారు.అనంతరం న్యాయ సేవా సదన్ నుండి కొండా రెడ్డి బురుజు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమములో సార్డ్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దయాకర్,అకౌంట్స్ ఆఫీసర్ శివ,అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాంబశివరావు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ శివారెడ్డి,ఎన్. జి. ఓ. డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు,లక్ష్మి సంబంధిత శాఖలు, పానెల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లు, దుకాణ కార్మికులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *