ఆశ్రం మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో వర్క్ షాప్
1 min read
మార్చి 7వతేదీ నుండి 9వ తేదీ వరకు
వివిధ రాష్ట్రాల నుండి సుమారు 100 మంది డాక్టర్లు హాజరు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : అల్లూరి సీతారామరాజు ఎకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఏలూరు రజతోత్సవ వేడుకల్లో భాగంగా మార్చి ఏడవ తేదీ నుండి 09-03-2025 తేదీల్లో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ లైవ్ సర్జికల్ & కెడెరిక్ హ్యాండ్ఆన్ వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ వర్క్షాప్ AOI AP మరియు AOI గోదావరి ఆధ్వర్యంలో ఈ.ఎన్.టి ఆశ్రమ్ మెడికల్ కాలేజి విభాగము ద్వారా నిర్వహించబడుతుందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒరిస్సా, కర్నాటక & తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 80 నుండి 100 మంది డాక్టర్లు ఈ వర్క్ షాప్కు హాజరవుతున్నారని తెలియపరచు చున్నాము.ఈ వర్క్ షాప్ కు అతిధిగా డా. సి.హెచ్. పకీర్ దాస్, మాజీ ప్రొఫెసర్ HOD of ENT, ASRAMS, డా.కె మేఘనాధ్ , ఛీఫ్ ఆపరేటింగ్ గెస్ట్ ప్యాకల్టీ & వర్క్షాప్ కోర్స్ డైరెక్టర్, డా. దీపక్ హల్దీపూర్ , ఛీఫ్ ఎండోస్కోపిక్ స్కల్ బేస్ & సైనస్ సర్జరీ నిపుణులచే రాబోయే వర్ధమాన ఈ.యన్.టి సర్జన్లకు మార్గనిర్దేశం చేయడానికి మరియు జ్ఞానాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్ నుండి చాలా మంది ప్రముఖ ఈ.యన్.టి సర్జన్లు ఈ వర్క్ షాప్నకు హాజరవుతున్నారని ఈ.యస్.టి డిపార్ట్మెంట్ హె.చ్.ఓడి. డా.డి. మోహంతీ తెలియజేయటం జరిగింది. దీనిలో భాగంగా ఎండో నాసల్ లైవ్ సర్జరీలు, ముక్కు మరి యు పారా నాసల్ సైనస్లకు సంబంధించిన వివిధ అంశాలపై ఉపన్యాసాలు నిర్వహించడంతో పాటు ఆశ్రం హాస్పిటల్స్ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీచే కెడెవర్ పై హ్యాండ్స్న్ ట్రైనింగ్తో పాటు రాబోయే వర్ధమాన ఈ.యన్.టి సర్జన్లకు వారి శస్త్రచికిత్స నైపుణ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ వర్క్షాప్ పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఉపన్యాసాల ద్వారా నేర్చుకోవటానికి, జ్ఞానాన్ని పొందడానికి మరియు వారికి రాబోయే పరీక్షలకు సహాయపడుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ప్రశ్నాపత్రం విభాగం ఉంటుంది. డెలిగేట్లకు సందేహాలు నివృత్తి చేయడానికి మరియు వారి జ్ఞానాన్ని మెరుగుపరచడానికి వారి మధ్య ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయని తెలియజేశారు.ఆశ్రం మెడికల్ కాలేజి ఈ.యస్.టి విభాగం ద్వారా వినికిడి లోపం, గొంతులో కాయలు, ముక్కు దూలం, సంబంధించిన చెవి, ముక్కు సమస్యలకు ఉచితముగా డా. వై.యస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేయబడును అని కావున ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సి.ఇ.ఓ. డా. హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.ఈ. యన్.టి డిపార్ట్మెంట్ హె.చ్. ఓడి, డా. డి. మోహంతీ మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ద్వారా అత్యున్నతమైన ప్రమాణాలతో వైద్యుల్ని తయారుచేయాలనే లక్ష్యంతో సాంకేతికత పరంగాను, వైద్య పరంగాను ఉత్తమ చికిత్సలను అందించాలనే ఉద్దేశంతో ఈ లైవ్ వర్క్ పను ఆర్గనైజ్ చేయటం జరిగిందని తెలిపారు. ఇలా ప్రతి విభాగంలో వర్క్ షాప్లను నిర్వహించటం ద్వారా నాణ్యమైన వైద్యసేవలు సగటు ప్రజలందరికీ అందుబాటులో ఉండెదుకు దోహదం చేస్తాయని ఆశ్రం సి.ఇ.ఓ. డా. హనుమంతరావు తెలియజేశారు.