PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగిసిన ప్రపంచ ఆక్యుపంక్చర్ డే ఉత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: దేశవ్యాప్తంగా నవంబర్ ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రపంచ ఆక్యుపంచర్ డే ఉత్సవాలు విజయవంతంగా ముగిసాయి. స్థానిక డి ఎం ఎస్ ఎస్వి హెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్  ఆవరణం లో జరిగిన ,వరల్డ్ ఆక్యూపంక్చర్ డే 2023 జాతీయ సదస్సు  ఉత్సవం లో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సుకు  ఆక్యూపంక్చర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ జాతీయ జనరల్ సెక్రెటరీ డాక్టర్ మాకాల సత్యనారాయణ అధ్యక్షత న ఘనంగ ముగిసాయి. ఈ ఆయన  మాట్లాడుతూ నవంబర్ 1 తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రపంచ ఆక్యుపంచరు డే వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని, రేపటి ప్రపంచ ఆరోగ్యం, ఆనందం, ఆక్యూపంక్చర్ సైన్సు తోనే సాధ్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన మచిలీపట్నం డి.ఎస్.పి శ్రీహరి ,కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ , ఇబ్రహీంపట్నం జెన్కో సూపర్ ఇంటెండెంట్  రాజారావు ,ప్రోగ్రాం కోఆర్డినేటర్ తెరపిస్ట్ శ్రీదేవి, జాయింట్ సెక్రెటరీ ఆర్య రాజకుమారి, లెనిన్ ఉన్నారు ఈ సందర్భంగాపలువురు వక్తలు మాట్లాడుతూ  ప్రకృతి ఇచ్చినటువంటి వైద్య సంపద కనిపించని ,సాంస్కృతిక, వారసత్వం యోగ ఆక్యుపంచర్ కూడా అందరూ ఆచరించాలని అని అన్నారు.  .  ఎంతో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ వైద్యం గా నిలిచిందని, భారత ప్రభుత్వం దీనిని ప్రత్యేక విభాగ చికిత్సగా గుర్తించిందని తెలిపారు.మహారాష్ట్ర ప్రభుత్వంఆక్యూపంక్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తుందని ,మిగతా రాష్ట్రాలు అదేవిధంగా ఆక్యుపంచర్ సైన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆక్యుపంచర్ ప్రపంచవ్యాప్తంగా ఈ సైన్సు ఉపయోగించి అనేక సర్జరీలను తగ్గించినట్లు  పేర్కొన్నారు. కరోనా తర్వాత పశ్చిమ దేశాలలో ఈ సైన్సు వినియోగం పెరిగిందని ,అనేక మందికి ఉపాధి దొరికే ఈ సైన్సు కళాశాలలను దేశంలో ప్రోత్సహించవలసిందని తెలిపారు  భారతీయ సంప్రదాయ వైద్యం విధానం  అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి అవలంబిస్తున్నారు. కొన్ని కొన్ని రుగ్మత లకు, మందు లు లేని సమస్యలకు సాంప్రదాయ వైద్య విధానం ఉపయోగపడుతుందని ..చిన్న చిన్న సమస్యలకు ఆసుపత్రులకు వెళ్లకుండా  యోగ మరియు ఆక్యు ప్రెషర్ ద్వారా కూడా కొన్ని సమస్యలు మనకు మనమే పరిష్కరించుకోవచ్చని తెలిపారు  ఈ సమావేశం అనంతరం వివిధ విభాగాలలో 30 మంది వివిధ రకాల వైద్య సేవలు ,సామాజిక సేవలు, చేసిన వారికి ఉత్తమ ఆక్యుపంచర్ కి తెరపిస్టు ఉత్తమ అక్యుపంచర్ కి వైద్యరత్న ఉత్తమ ఆక్యుపంచర్ కి సేవారత్న అవార్డుల  ఇవ్వడంజరిగింది.ఈ జాతీయ సదస్సులో అక్యు పంచర్  సైన్స్ ప్రాక్టీస్నర్స్ అసోసియేషన్ భారత్   ,( ఏ ఎస్ పి ఏ) కార్యవర్గం సభ్యులు తదితరులు. పాల్గొన్నారు.

About Author