ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు…
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూకర్నూలు మెడికల్ కాలేజీ నందు మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ లో ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం అక్టోబరు 16న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనస్థీషియా (మత్తుమందు) ఇచ్చి శస్త్రచికిత్స చేసిన రోజుకు అక్టోబరు ప్రపంచ అనస్థీషియా డే పురస్కరించుకొని 16న గుర్తుగా జరుపుకోనున్నట్లు తెలిపారు.ఆపరేషన్ కి ముందు నొప్పి లేకుండా సర్జరీ చేయడానికి అనస్థీషియా వైద్యులు కీలక పాత్ర అని తెలిపారు. ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని వైద్యులకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి అనస్థీషియా డిపార్ట్మెంట్ HOD, డా.విశాల, గైనిక్ డిపార్ట్మెంట్ HOD, డా. వెంకటరమణ, ప్లాస్టిక్ సర్జరీ HOD, డా.మంజుల బాయ్, వైద్యులు తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు తెలిపారు.