ప్రపంచ రక్తపోటు దినోత్సవం
1 min read– 17 మే 2023 డాక్టర్ మూడే సందీప్
– సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కిమ్స్ సవీర,
పల్లెవెలుగు వెబ్ అనంతపురం : అధిక రక్తపోటు (BP) పెరగడం పై ప్రజలకు అవగాహన కల్పించడం మరియు ఈ నిశ్శబ్ద వ్యాధిని నిరోధించడానికి మరియు నియంత్రించడానికి అన్ని దేశాల పౌరులను ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవం (WHD) జరుపుకుంటారని డా. మూడే సందీప్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ తెలిపారు.
• ప్రపంచ రక్తపోటు దినోత్సవం (WHD) అనేది ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హైపర్‌టెన్షన్ యొక్క అనుబంధ విభాగమైన వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్ (WHL) నిర్వహిస్తుంది.
• ప్రపంచ రక్తపోటు దినోత్సవం 2023 యొక్క నేపధ్యం: మీ రక్తపోటును ఖచ్చితంగా తనిఖీ చేసుకోండి. మీ జీవితకాలన్ని మెరుగుపరుచుకొండి.
రక్తపోటు వ్యాధికి కారణాలు:
• ధూమపానం చేయడం మరియు మద్యం ఎక్కువగా తీసుకోవడం
• అధిక బరువు ఉండటం (ఊబకాయం)
• శారీరక శ్రమ లేకపోవడం
• ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం
• మానసిక ఒత్తిడి
• అధిక రక్తపోటు కుటుంబ నేపథ్యం
• దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి
• థైరాయిడ్ సమస్యలు
రక్తపోటు వ్యాధి ప్రభావం:
• రక్తపోటు హృదయ సంబంధ వ్యాధులకు ప్రధాన ప్రమాద కారకం.
• అధిక రక్తపోటు మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
• ఇది కిడ్నీలపై కూడా ప్రభావం చూపిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు దెబ్బతింటాయి.
• నేత్ర సంబంధ సమస్యలు తలెత్తుతాయి
జాగ్రత్తలు:
• రక్తపోటు వ్యాధి గురించి అవగాహన పెంచుకోవాలి.
• రోజూ తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువ ఉండేలా చూసుకోవాలి.
• ఆహారంలో కొవ్వు పదార్ధాలు పరిమితి మించకుండా జాగ్రత్తలు పాటించాలి.
• అధిక బరువు ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకునేందుకు తగిన వ్యాయామం చేయాలి.
• మద్యం తాగే అలవాటు ఉంటే మోతాదు మించకుండా చూసుకోవాలి.
• రక్తపోటును ఎప్పటికప్పడు పరీక్షించుకుంటూ ఉండాలి.
• అధిక రక్తపోటు ఉన్నట్టయితే వైద్యుల సలహాపై తగిన మందులను నిరంతరాయం తీసుకోవాలి
మారిన జీవన శైలే కారణం.
ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం మనిషిని కాలు కూడా కదపనీయడం లేదు. కూర్చొన్న చోటు నుంచి కనీ సం లేవకుండానే అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నాడు. సెల్‌ఫోన్ సంభాషణలు, ఇంటర్నెట్ చాటింగ్‌లు మనిషి జీవనశైలిని పూర్తిగా మార్చేశాయి. ఇంటి ఆహారానికి బదులు హోటళ్లలో రెడీమేడ్‌గా దొరికే బిర్యానీలు, ఫిజ్జాలు, బర్గర్లు, మద్యం కూడా అధిక బరువుకు కారణమవుతున్నాయి.
అంతర్జాతీయ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ సవీర హాస్పిటల్, అనంతపురంలో మే చివరి వారం వరకు ఉచితంగా బిపి చెకప్ మరియు రక్తపోటు మీద సందేహాలకు సమధానాలు నివృత్తి చేయబడునని డాక్టర్. సందీప్ తెలిపారు.