PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

1 min read

– వినియోగ ఫారంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవ లోపాలు, వస్తు లోపాలద్వారా పరిహారం పొందే హక్కు గలుగుతుంది
రెవెన్యూ డివిజనల్ అధికారి దాసి రాజు
పల్లెవెలుగు వెబ్ భీమవరం : వస్తువుల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణంలకు సంబంధించిన అవగాహన వినియోగదారులకు కలిగించడం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం అని రెవిన్యూ డివిజనల్ అధికారి దాసి రాజు అన్నారు. బుధవారం స్థానిక ఛాంబరు ఆఫ్ కామర్స్ లో ప్రపంచ వినియోగ దారుల హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్ డి వో దాసి రాజు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆర్ డి వో మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల సమాచారం, అవగాహన ప్రతి వినియోగదారులకు కల్పించ వలసిన బాధ్యత మనఅందరి పైఉందన్నారు. వినియోగదారులకు చైతన్యం, సంరక్షణ, సంక్షేమం, తది తర సేవలను సంఘాలు, సంస్థలు మరింత బాగా పని చెయ్యాలన్నా రు.నాణ్యమైన సేవలు పొందే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. వస్తువులను సేవలను ఎంపిక చేసుకునే హక్కు వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి మధ్య రేటు ప్రతి వినియోగ దారుడు తెలుసుకోవడం మంచిదన్నారు. వినియోగదారుల ఇబ్బందులను , అవసరాలను ఫోరంలలో వినిపించడం చాలా అవసరం అన్నారు.వినియోగ దారుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన వివిధ వేదికలలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వాణిని వినిపించాలన్నారు. వినియోగదారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవా లోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు కలుగుతుందన్నారు. వినియోగదారులు మోసానికి గురయినప్పుడు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొందాలన్నారు. వినియోగదారులు నిరంతరం తమ హక్కులను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని పెంచుకోవడం చాలా అవసరం అన్నారు.గ్రామీణ ప్రాంతాలలో వినియోగదారులు హక్కుల పట్ల అవగాహన లేక ఎంతో మంది మోసపోతున్నారని అటువంటి వారికి అవగాహన కల్పించాలని ఆర్ డి వో దాసి రాజు అన్నారు. వినియోగదారుల జిల్లా అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య రూపొందిన అంతర్జాతీయ వినియోగ దారుల దినోత్సవం సందర్భంగా కరపత్రికలను ఆర్ డి వో దాసి రాజు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి యన్.సరోజ,జిల్లా మేనేజరు టి.శివ రామ ప్రసాద్,తూనికలు,కొలతలు శాఖ సహాయ కమిషనరు వి వి నాగ రాజా రావు,జిల్లా వినియోగ దారుల సంఘం అధ్యక్షులు బొబ్బిలి. బంగారయ్య, ఉపాఅధ్యక్షులు మేళం.దుర్గా ప్రసాదు,జి.గోపాల కృష్ణం రాజు, ఏ ఆర్ కె హనుమంత రావు, వివిధ సంఘాల సభ్యులు , తది తరులు పాల్గొన్నారు.

About Author