భవిత సెంటర్ లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
1 min read– ఎంఈఓ లు. గంగిరెడ్డి. సునీత
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: భవిత సెంటర్ కు దివ్యాంగుల పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెన్నూరు మండల విద్యాశాఖ అధికారులు గంగిరెడ్డి. సునీత లు పేర్కొన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం లో భాగంగా శుక్రవారం చెన్నూరు భవిత సెంటర్ నందు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్నిఐఇఆర్ పిలు శ్రీదేవి. కళావతి. చెన్నూరు భవిత సెంటర్ ఫిజియోథెరపీ వైద్యురాలు ఎలిజిబెత్ రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ లు మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలకు భవిత సెంటర్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు. పిల్లలకు విద్యతోపాటు కనీస అవసరాలు తీర్చేందుకు ఇద్దరుఐఇఆర్ పి లును ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే దివ్యంగా పిల్లలకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి బుధవారం ఫిజియోథెరపీ డాక్టర్ ను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. దివ్యాంగ సెంటర్ కు దివ్యాంగ పిల్లను చేర్పించేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా అవసరం ఉందని వారు తెలియజేశారు. పిల్లలకు అందుతున్న ఫిజియోథెరపీ వైద్య సేవలపై డాక్టర్ ఎలిజిబెత్ రాణి వివరించారు. ఈ కార్యక్రమంలోఐఇఆర్ పి లు శ్రీదేవి. కళావతిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి విద్యాశాఖ అధికారులచే బహుమతులు అందజేశారు. పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సి జీవి. చెన్నమ్మ విద్యార్థులు పాల్గొన్నారు.