ప్రపంచ మేధావి అంబేద్కర్ : చమర్తి జగన్ మోహన్ రాజు
1 min readఅంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమ కుమారి
పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా నేడు రాజంపేట పట్టణంలోని R&B అతిథి గృహం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు ఎన్టీఆర్ సర్కిల్ వద్దనున్న విగ్రహాలకి ఎమ్మార్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రజాసామిక హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.రాజ్యాంగ నిర్మాణం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏకతాటికి తీసుకొచ్చిన ఘనత ఒక్క అంబేద్కర్ దే ఈసందర్భంగా ఆయన తెలియజేశారు. అటువంటి మహనీయుడిని ప్రతి పౌరుడు ఆదర్శంగా తీసుకొని నడయాడాలని జగన్ మోహన్ రాజు సూచించారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వెంకటేష్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాలిశెట్టి సుధాకర్,మాల మహానాడు సలహాదారులు జోరెపల్లి భాస్కర్,నాయకులు కొమ్మ ఎల్లయ్య పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు,మండల పార్టీ ఉపాధ్యక్షులు సతీష్ రాజు, సీనియర్ నాయకులు G.V సుబ్బరాజు, సూర్యనారాయణ రాజు,టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్,రామారావు నాయుడు,నాగేంద్ర తులసి, వెంకటేష్ యాదవ్,సుబ్రహ్మణ్యం, హరికృష్ణ,రామ్మోహన్,శంకర్, శేఖర్,తదితరులు పాల్గొన్నారు.