ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : అందరు ఆరోగ్యంగా ఉంటే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్ని వైద్యాధికారిణి వాణిశ్రీ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ప్యాపిలి పట్టణంలో ని 4వ సచివాలయం లో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ విధానం ద్వారా ప్రజలకు బీ పి, సుగర్ రక్తహీనత, ఓ పి పరీక్షలు నిర్వహించి మందులు డాక్టర్ వాణిశ్రీ అధ్వర్యంలోపంపిణీ చేశారు.ఈసందర్భంగా శనివారం ఎల్. రాఘవేంద్ర గౌడ్ ఆరోగ్య విద్యాబోధకుడు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా అందరికి ఆరోగ్యం హెల్త్ ఫర్ ఆల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనే నినాదంను గురించి అవగాహన కల్పిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం,పరిశుభ్రమైన మంచి నీరు, శుభ్రమైన ఆహరం ను, తీసుకోవాలెనని,జీవన విధానములో పోషకాహారం తీసుకోవడం,వ్యాయామంను దినచర్య గా అలవరచు కోవలెనని,అనారోగ్య సమస్య ఏర్పడిన వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసులుకోవాలెనని తెలపారు. కార్యక్రమం లోసూపర్ వైసర్ గంగాదేవి,ఎం ఎల్ ఎచ్ పి మల్లేశ్వరి,రోజా,104,ఆశ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.