NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

29న ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు

1 min read

కర్నూలు హెల్త్​ క్లబ్​ ఆధ్వర్యంలో వాల్​ పోస్టర్​ను విడుదల చేసిన కలెక్టర్​ జి.సృజన

పల్లెవెలుగు:ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలను ఈ నెల 29న అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు  కర్నూలు హెల్త్​ క్లబ్​ కార్యదర్శి, ప్రముఖ కార్డియాలజిస్ట్​  డా. పి.చంద్రశేఖర్, MD.,DM.,FACC  తెలిపారు. శుక్రవారం కలెక్టర్​ క్యాంప్​ కార్యాలయంలో ప్రపంచ హృదయ దినోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్​ను కలెక్టర్​ జి. సృజన చేతుల మీదుగా విడుదల చేశారు.  ఈ సందర్భంగా డా.పి. చంద్రశేఖర్​ మాట్లాడుతూ  కర్నూల్ హార్ట్ ఫౌండేషన్, కర్నూలు & AP కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా-AP చాప్టర్ ఆధ్వర్యంలో 2005 నుండి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా   ప్రపంచ హృదయ దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా  సెప్టెంబరు 29, 2023 న కూడా  కర్నూలు హెల్త్​ క్లబ్​, ఏ క్యాంప్​, కర్నూలు నందు వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్. జార్జ్ జోసెఫ్, MD.,DM., FCSI క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, కార్డియాలజీ ప్రొఫెసర్ వస్తున్నట్లు తెలిపారు. మానవుల జీవనశైలిలో మార్పులు, హృదయ సంబంధ వ్యాధులు విజృంభించడానికి ఎలా దారితీశాయి తదితర అంశాలపై  సెమినార్ నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. జి. సృజన, IAS., కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ & అధ్యక్షులు, కర్నూలు హార్ట్ ఫౌండేషన్, కర్నూలు  కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. గౌరవ అతిథులుగా జి. కృష్ణకాంత్, IPS రామశంకర్ నాయక్, IAS.,(Rtd  కలెక్టర్, ఎస్పీ, కర్నూలు. నాగేశ్వర రావు, రీజనల్ హెడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కర్నూలు పాల్గొననున్నారు.  వాల్​ పోస్టర్​ను విడుదల చేసిన వారిలో కె.సి.కల్కూర President, Gadicherla Foundation డాక్టర్ భవానీ ప్రసాద్, MD. వైద్యుడు సెక్రటరీ డాక్టర్ A. వసంత కుమార్, MD.,DM. అధ్యక్షుడు, APCSI Dr. Gelvi Sahadevudu, MS., Senior Surgeon, Nandyal  తదితరులు పాల్గొన్నారు.

About Author