PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరల్డ్​ హార్ట్​ డే పోస్టర్​ విడుదల

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : ఈనెల 29న వరల్డ్​ హార్ట్​ డేను పురస్కరించుకుని ముందస్తు అవగాహన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్​ పి. కోటేశ్వరరావు వరల్డ్​ హార్ట్​ డే పోస్టర్లను విడుదల చేశారు. కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో కర్నూలు జెడ్పీ ఛాంబరులో శుక్రవారం హార్ట్​ ఫౌండేషన్​ చైర్మన్​ , కలెక్టర్​ పి. కోటేశ్వరరావు వరల్డ్​ హార్ట్​ డే పోస్టర్లను విడుదల చేశారు.

అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ గుండె సంబంధిత సమస్యలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సెక్రెటరీ, కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ కు సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి , కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author