ప్రపంచ జనాభా దినోత్సవం…
1 min read
అధిక జనాభా వల్లే కలిగే ప్రభావాలను వివరించారు
వ్యాసరచన,వకృత్వం,పోస్టర్ పెయింటింగ్ లపై పోటీలు, సర్టిఫికెట్స్ పంపిణీ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రపంచ జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి డాక్టర్:పి.రత్న మేరీ “హెచ్ఓడి” మార్గదర్శకత్వంలో II & III బి.ఎ. సాంఘిక శాస్త్ర విద్యార్థులు జూలై 11, 2025న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్:సిస్టర్ మెర్సీ ప్రిన్సిపాల్ ఈ దినోత్సవ ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. డాక్టర్: సిస్టర్ సునీలా రాణి వైస్ ప్రిన్సిపాల్ అధిక జనాభా వల్ల కలిగే ప్రభావాలను మరియు దాని గురించి కొన్ని వాస్తవాలను వివరించారు.ఈ సందర్భంగా సాంఘిక శాస్త్ర విభాగం వ్యాస రచన, వక్తృత్వం, పోస్టర్ పెయింటింగ్ వంటి వివిధ పోటీలను నిర్వహించి, సర్టిఫికెట్లను పంపిణీ చేసింది. దాదాపు 1200 మంది విద్యార్థులు మరియు బోధనా సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.
