PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంకుర హాస్పిటల్లో.. ప్రపంచ ప్రీ-మెచ్యూరిటీ డే వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ప్రపంచ ప్రీమెచ్యూరిటీ డే సందర్భంగా మహిళలు మరియు పిల్లల   అంకుర హాస్పిటల్, లో ‘లైట్ అఫ్ లైఫ్’ శీర్షికన నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలు మరియు వారి కుటుంబాలతో శనివారం జరిగిన ఒక కార్యక్రమం అంకుర హాస్పిటల్ లో జరిగింది. ఈ సందర్భంగా అంకుర హాస్పిటల్ ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ పున్నంమాట్లాడుతూ నెలలు నిండకుండానే జన్మించటం (గర్భం దాల్చిన తరువాత, 37 వ వారానికి ముందు) ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో మరణానికి ప్రధాన కారణం. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల మంది పిల్లలు ముందే జన్మిస్తున్నారు, అంటే ప్రతి 10 మంది పిల్లలు లో ఒకరు ఈ విధంగా నే జన్మిస్తున్నారు. ఈ రోజు ప్రీ-టర్న్ డెలివరీలు మరియు ప్రీ-టర్మ్ పిల్లలు, వారి కుటుంబాల ఆందోళనల గురించి అవగాహన కల్పించటానికి అంకుర ఆసుపత్రిలో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు.ప్రీమెచ్యూరిటీ డే వేడుకలో భాగంగా ప్రీ-టర్మ్ శిశువుల ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలకమైన వైద్యులు, నర్సులు మరియు ఇతర సహాయక సిబ్బంది అందరినీ ఘనంగా. సత్కరించారు.నెలలు నిండ కుండానే పుట్టిన పిల్లలు మరియు వారి తల్లిదండ్రులను అంకుర ఆసుపత్రిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.. వారి విజయాన్ని పూర్తిగా వేడుక జరుపుకున్నారు.ఇప్పటివరకు అంకుర హాస్పిటల్ 250 కి పైగా నెలలు నిండకుండానే పుట్టిన శిశువుల ప్రాణాలను కాపాడింది, మరియు ప్రీ టర్మ్ డెలివరీలను నిర్వహించడంలో 98% సక్సెస్ రేటును కలిగి ఉంది. ఈ కేసులు, అంకుర ఆసుపత్రిలో అన్ని రకాల క్లిష్టమైన కేసులను నిర్వహించడానికి మరియు రోగులకు అగ్రశ్రేణి ఆరోగ్య సంరక్షణను అందించడానికి శిక్షణ పొందిన నిపుణుల వైద్యుల బృందం అధునాతన సాంకేతికపరిజ్ఞానం మరియు అత్యాధునిక మౌలిక సదుపాయాలు అన్ని స్థాయి ల 3పిఐసియు, ఎన్ ఐ సి యు ఆపరేషన్ థియేటర్లు మరియు పూర్తి సదుపాయాలు కలిగిన అంబులెన్సులు వున్నాయని అన్నారు.   , “అంకుర హాస్పిటల్, నెలలు నిండకుండానే పుట్టిన శిశువులను కాపాడటంలో అపూర్వ మైన విజయం సాధించటం మరియు ఆ విజయాల రేటు ని నిర్వహించడం పట్ల గర్విస్తుంది. మా బృందం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, మెదడు మరియు ఇతర అవయవాలకు సంబంధించిన పెద్ద సమస్యలు లేకుండా ‘ఆరోగ్యవంతమైన’ జీవితాన్ని అందించటం. ఇది రోగులకు అధిక-నాణ్యత సంరక్షణను అందించడానికి ఆసుపత్రి యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. ప్రీ-టర్మ్ శిశువుల సాధారణ పెరుగుదల మరియు అభివృద్ధిని నిర్ధారించడంలో మేము కుటుంబాలను కూడా భాగం చేస్తాము. ఇటీవల వైద్యులు, నర్సులు మరియు ఇతర సహాయక సిబ్బంది బృందం చేత ప్రాణాలు కాపాడిన ప్రీ టర్మ్ శిశువులతో పాటుగా తల్లిదండ్రులు ఈ రోజు వచ్చారు. ఈ కుటుంబ సభ్యుల మోముల్లో చిరునవ్వును తిరిగి తీసుకురాగలగటం మాకు ఆనందం కలిగించింది. అన్నారు. ప్రీ టర్మ్ శిశువుల ప్రాణాలను కాపాడటానికి అశేష కృషి చేసిన వైద్యులు, నర్సులు మరియు ఇతర సహాయక సిబ్బందిని మేము సత్కరించాము.  మీరు సహాయం లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదని ఆయన అన్నారు.     ప్రెగ్నెన్సీ సమయం లో అతి సాధారణ సమస్యలలో ఒకటి గా ప్రీ టర్మ్ డెలివరీ కనిపిస్తుంది. ఈ రోజున వివిధ సామాజిక పరిస్థితి లు మరియు జీవనశైలికి సంబంధించినది సమస్యలు దీనికి కారణమవుతున్నాయి. అంకుర ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన మరియు అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యుల బృందం ఉండటం తో పాటుగా నెలలు నిండకుండానే పుట్టిన శిశువుల ప్రాణాలను కాపాడటానికి మరియు వారికి సాధారణ జీవితం ఉందని నిర్ధారించడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు సైతం ఉన్నాయి. క్లిష్టమైన ఆరోగ్య కేసుల సేవలు మరియు మనుగడ రేట్ల పరంగా మేము ప్రీమియర్ గ్లోబల్ హెల్త్ కేర్ సంస్థలకు బెంచ్ మార్క్ చేస్తాము మరియు ప్రీ-టర్మ్ జననాలలో ప్రపంచ స్థాయి సేవలను నిర్ధారించడంలో మా ప్రసూతి వైద్యులు మరియు పీడియాట్రిషియన్ల ఎంతో సహకరిస్తున్నారని అన్నారు. . ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.

About Author