PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రపంచ స్ట్రోక్ డే 2023…

1 min read

“మనం కలిసి .. గ్రేటర్ కంటే స్ట్రోక్.”

డాక్టర్ జాషువా కాలేబ్ .కె

సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్

కిమ్స్ సవీరా, అనంతపురం

పల్లెవెలుగు వెబ్ అనంతపురం:  ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న నిర్వహిస్తారు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ 2004 నుండి ప్రతి సంవత్సరం ఒక థీమ్ ముఖ్య అంశాన్ని ప్రకటించడం జరుగుతుంది. స్ట్రోక్ ల నివారాణ మరియు చికిత్సల అవగాహ పెంచడానికి ఈ రోజును పాటిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ మరణానికి రెండవ ప్రధాన కారణం మరియు వైకాల్యానికి మూడవ  ప్రధాన కారణం. మన భారతదేశంలో బ్రెయిన్ స్ట్రోక్ బాధితులు సంఖ్య ఎక్కువ అని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి ఏడాది సగటున 1,85,000 మంది ఈ పక్షవాతం లేదా బ్రెయిన్ స్ట్రోక్ కు గురువుతున్నారు. లేక ప్రతి 40 సెకన్లకు ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు మరియు ప్రతి 4 నిమిషాలకు ఒకరు ఈ వ్యాధి చేత మరణం చెందుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా నమోదవ్వడానికి గల కారణాలు.

–          వ్యాధి గల కారణాల పట్ల సరైన అవగాహన లేకపోవడం

–          ప్రారంభంలోనే వ్యాధిని అరికట్టడానికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం

నివారించదగ్గ కారణాలు

–          ఇష్కిమిక్ హార్ట్ డీసీస్ (గుండె సంబంధిత జబ్బులు)

–          ఏట్రియల్ ఫిబ్రిల్లేషన్ (గుండె సంబంధిత జబ్బు)

–          మధుమేహం (చక్కెర వ్యాధి)

–          ఊబకాయం

–          మద్యపానం

–          ఎక్కువగా కదలిక లేని జీవన శైలి.

నివారించలేని కారణాలు

–          వయస్సు

–          జాతి (మగ, ఆడ)

–          జన్యపరమైన కారణాలు

అతి త్వరగా సంకేతాలను గుర్తించడం మరియు తగిన సమయంలో సరియైన వైద్యం అందించడం ద్వారా వైకల్యాన్ని ఆరికట్టవచ్చు. –      స్ట్రోక్ నుండి బయట పటడానికి సమయం అతి ముఖ్యమైన అంశం. – బ్రెయిన్ స్ట్రోక్ అంటే మొదడులోని ఒక భాగానికి రక్తప్రసరణ ఆగిపోవడం. ఇలా రక్తప్రసరణ ఆగిన ప్రతి నిమిషానికి 20 లక్షల న్యూరాన్లు (కణాలు) చనిపోవడం జరుగుతుంది. ఎంత ఆలస్యం అయితే అంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తించడానికి సంకేతాలు

బి-బ్యాలెన్స్ సమస్యలు (తూలడం)

ఈ – చూపు మందగించడం, రెండుగా కనబడడం

ఎఫ్ – ముఖం వంగిపోవడం

ఎస్- అస్పష్టమైన మాటతీరు

టి – సమయం చాలా మఖ్యమైనది

వైద్య సదుపాయాలు

థ్రాంబోలైసిస్ అనగా గడ్డ కట్టిన రక్తనాళానికి ఇంజెక్షన్ ద్వారా కరిగించే ప్రయత్నం చేయడం. దాని ద్వారా బ్రెయిన్ లోని ఏ ప్రాంతానికైతే రక్తప్రసరణ ఆగిపోయిందో దానికి పునరావృత్ చేయడం జరుగుతుంది. దీని వలన వైకల్యానికి నిర్మూలించవచ్చు.

-ఈ చికత్స రోగికి మొదట సంకేతం ప్రారంభమైన 4 గంటల 30 నిమిషాలలో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.

–          కాబట్టి న్యూరాలజి విభాగం మరియు అన్ని సదుపాయాలు గల ఐసియు ఉన్న హాస్పిటల్ కి స్ట్రోక్ వచ్చిన 4 గంటల లోపు రోగిని తీసుకవెళ్లడం కీలకం.

–          మొదటి సంకేతం లేదా బలహీనత  వచ్చిన గంటలోపు థ్రాంబోలైసిస్ చేసిన వ్యక్తి, 4 గంటలలోపు థ్రాంబోలైసిస్ చేసిన వ్యక్తి కంటే మెరుగుగా కోలుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు.

మనం కలిసి #స్ట్రోక్ కంటే గొప్పవాళ్ళం, అన్న ఈ అంశాన్ని ప్రజలలోకి తీసుకవెళ్లి వారికి ఈ వ్యాధి గురించిన అవగాహన మరియు సమయం యొక్క ప్రాధాన్యతను గురించిన చైతన్యం అందించాలని మా ఆశయం.

About Author