ప్రపంచ ట్రామా దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించిన జెమ్‌కేర్ కామినేని హాస్పిటల్స్ కర్నూలు ట్రాఫిక్ DSP నాగభూషణంకి సన్మానం. 17న వరల్డ్ ట్రామా డే సందర్భంగా AP ట్రాఫిక్ పోలీస్ అసోసియేషన్ తో రాజ్ విహార్ సర్కిల్ లో ఈరోజు ఉదయం ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా AP ట్రాఫిక్ పోలీస్ అందిస్తున్న సేవలు మరియు ట్రమా మేనేజ్మెంట్ లో వాళ్ళు చేస్తున్న విశిష్టత గురించి వివరించ జేమ్ కేర్ కామినేని హాస్పిటల్ మానేజ్మెంట్ మరియు డాక్టర్ లు డిఎస్పి నాగభూషణంకి సన్మానించారు. ఈ సందర్భంగా డిఎస్పి నాగభూషణం మాట్లాడుతూ ట్రమా డే యొక్క విశిష్టతను వివరించారు మరియు ప్రజలు తీసుకోవాల్సిన నియమాలు, ట్రమా ఎలా నివారించాలి అని సూచనలు ఇవ్వటం జరిగింది, అలాగే హాస్పిటల్ వారు చేస్తున్న సేవలు గురించి కొనియాడారు. జేమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ ఎమర్జెన్సీ హెచ్ ఒ డి డాక్టర్ రామ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ట్రమా మేనేజ్మెంట్ ప్రముఖ్యత మరియు విశిష్టత ప్రజలు ఎక్కడైనా ఎవరికి ఐన సడన్ ప్రమాదం జరిగితే, ప్రజలు ఆ సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు , ఇందులో భాగంగా జేమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ రవిబాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి 9 సెకన్లు కి ఒక ట్రామా జరుగుతోంది. ఇందులో ప్రజలు ఎలా జాగ్రతలు తీసుకోవాలి అని వివరించారు. అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ ఎండి – సి ఈ ఒ, డాక్టర్ బాలమురళి క్రిష్ణ జనరల్ సర్జన్ , డాక్టర్ గణేశ్ సి ఒ ఒ, రమణ బాబు. మార్కెటింగ్ హెడ్ , నధీమ్ ఆపరేషన్స్ హెడ్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అలాగే జేమ్ కేర్ కామినేని హాస్పిటల్ వారు వివిద రకముల ఐన కార్యక్రమంలో అంటే అతినా స్కూల్ లో 200 పై గా స్టూడెంట్స్ కి సి పి ఆర్ గురించి ట్రైనింగ్ ఇవాటం జరిగింది, అలాగే జేమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో 300 పై గా నర్సింగ్ స్టూడెంట్స్ కి ట్రైనింగ్ మరియు సర్టిఫికేట్ ఇవటం జరిగింది, ట్రామా టీం లో పని చేసే సిబ్బంది కి మరియు డాక్టర్స్ కి సన్మానం చేయటం జరిగింది.