ఘోరాతిఘోరంగా ఏపీ ఆర్థిక పరిస్థితి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ ఆర్థిక పరిస్థితి ఘోరాతిఘోరంగా ఉందని, అందుకే ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చలేకపోతున్నట్టు రవాణశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. నిజంగా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇంతమందితో ఎందుకు గొడవ పెట్టుకుంటామని అన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకు, తెచ్చిన అప్పులపై వడ్డీలు కట్టడానికి సరిపోతే.. ప్రజాసంక్షేమం కోసం డబ్బులు ఎక్కడ నుంచి తేవాలని ఉద్యోగులను ప్రశ్నించినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కేవలం 40 వేల కోట్లు మాత్రమే రుణం తేవగలమని ఆయన అన్నారు. రాష్ట్రంలో 1.57 కోట్ల తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని, వారంత ఉప్పు..పప్పు కొని ప్రభుత్వానికి జీఎస్టీ కడుతున్నారని ఆయన అన్నారు. వాళ్ల నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నప్పుడు.. వారికి ఏమీ చేయవద్దా అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.