శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఆలయం వద్ద అన్న సమారాధన
1 min read
2,000 మందికి మహా అన్న సమారాధన
60 సంవత్సరాలుగా నిర్విరామంగా కార్యక్రమాలు
వేలాదిగా భక్తులు పాల్గొని సీతారాముల ఆశీస్సులు అందుకొన్నారు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : మినీ బైపాస్ రోడ్డు స్థానిక రామకృష్ణాపురం 20వ డివిజన్ లో శ్రీ రామాలయం వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని రామాలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. గురువారం కమిటీ వారు పెద్దలు దాతల సహకారంతో సుమారు 2,000వేల మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆలయం సుమారు 60 సంవత్సరాలుగా స్థాపించబడి నిత్య దీప ధూప నైవేద్యాలతో విరాజిల్లుతుంది. ప్రతి ఏటా శ్రీ సీతారామ కళ్యాణం వేదమంత్రాలతో ఎంతో ఘనంగా నిర్వహించి పానకం, వడపప్పు తీర్థప్రసాదాలు అందిస్తారు. ఈ ఆలయ వ్యవస్థాపకులు బుద్ధాల బ్రహ్మానందం (బ్రహ్మానంద ప్రెస్) 1975లో స్థాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయంలో సీత రాము, లక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహా దాతలు పుప్పాల సూర్యనారాయణ (మాజీ మున్సిపల్ కౌన్సిలర్) వారి తల్లి పుప్పాల మహాలక్ష్మమ్మ అందించినట్లు చెబుతున్నారు. గతంలో సీతారాముల నవమి ఉత్సవాల సందర్భంగా రామాలయం వద్ద వీధి చలనచిత్రాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించేవారు. ఎంతోమంది విచ్చేసి ఆ కార్యక్రమాలను వీక్షించేవారు. నేటి ఆధునిక యుగంలో అందరికీ టెలివిజన్ లు ఇళ్లల్లో ఉండటంతో అటువంటి నేపథ్యాలు కనుమరుగయ్యాయి. నాటి నుంచి నేటి వరకు శ్రీ సీతారామ ఆలయ కార్యక్రమాలను బుద్దాల బ్రహ్మానందం,కుమారులు, మనవళ్లు, మనమరాళ్లు, మునిమనవళ్లు ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి సీతారామ లక్ష్మణు ఆంజనేయ స్వామివార్ల ఆశీస్సులు అందుకొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ కమిటీ పెద్దలు,భక్త బృందం పర్యవేక్షించారు.