జీవారాధనే దైవారాధన..
1 min readదేహమే దేవాలయం – జీవుడే దేవుడు
కరచరణాదులు కర్మలో చరించు చున్నను బుద్ధి భగవంతునిపై ఉండాలి
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ భక్తులకు పిలుపు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర చరణాదులు కర్మలో చరించు చున్నను బుద్ధి భగవంతునిపై ఉండాలని, జీవారాధనే దైవారాధన. దేహమే దేవాలయం – జీవుడే దేవుడని ఇది తెలుసుకుని జీవించడమే ఉత్తమ మానవ ధర్మమని విశ్వవిఖ్యాత యతి సార్వభౌముడు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ భక్తులకు ఉద్బోధించారు. కర్నూలు శివారులోని గోదాగోకులం నందు వెలసిన శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు జరుగుతున్న ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన పూజ్య స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తదనంతరం భక్తులందరికీ తీర్ధగోష్టి, ఉత్సవ వరులకు స్నపన తిరుమంజనం, చతుస్థానార్చన హోమం, నివేదన, పూర్ణాహుతి, బలి ప్రదానం, శాత్తుమొర, తీర్ధ ప్రసాద వినియోగం, స్వామి వారిని సూర్య ప్రభ వాహన సేవ శ్రీమన్నారాయణాచార్య స్వామి యాజ్ఞికత్వంలో అర్చకులు రమేశ్ భట్టర్, కిరణ్ భట్టర్ బృందం ఈ క్రతువులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి, శ్రీ అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామి, ప్రయాగ్ రాజ్ రాఘవ ప్రపన్న జీయర్ స్వామి, గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, పాలాది సుబ్రహ్మణ్యం, బాలసుధాకర్, భూమా కృష్ణ మోహన్, వేముల జనార్ధన్, తల్లం సురేష్, తలుపుల శ్రీనాథ్, పి.వెంకట సుబ్రహ్మణ్యం, మాజీ శాసనసభ్యులు ఎస్.వి.మోహన్ రెడ్డి, కె.డి.సి.సి.చైర్ పర్సన్ ఎస్.వి. విజయ మనోహరి, టి.జి.వి.గ్రూప్స్ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త టి.జీ.భరత్, టి.జి. శివరాజ్, జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులు దంపతులు, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, సహకార్యదర్శి ప్రాణేశ్, జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ, భజరంగదళ్ రాష్ట్ర కన్వీనర్ తూముకుంట ప్రతాప్ రెడ్డి, భాను ప్రకాశ్, ఆవోపా చీఫ్ నాగేశ్వరరావు, రత్న ప్రసాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.