PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విస్కీ బాటిల్ ధ‌ర తెలిస్తే షాక్ అవుతారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స్కాట్‌ల్యాండ్‌కు చెందిన మాకల్లన్‌ కంపెనీ ఈ భారీ స్కాచ్‌ విస్కీ బాటిల్‌ను తయారు చేసింది. ది ఇంట్రెపిడ్‌గా గుర్తింపు పొందిన ఈ బాటిల్‌ ఐదు అడుగుల 11 అంగులాల పొడవు ఉంది. అంటే సగటు మనిషి ఎత్తు కంటే ఎక్కువే. ఈ కంపెనీ ఇదే పేరుతో తయారు చేసే 444 రెగ్యులర్‌ బాటిల్స్‌ కలిస్తే ఎంతో.. ఈ విస్కీ బాటిల్‌ అంత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. స్కాట్‌ల్యాండ్‌ రాజధాని ఎడిన్‌బర్గ్‌కు చెందిన ప్రముఖ ఆక్షన్‌ హౌజ్‌.. లైఆన్‌ అండ్‌ టర్న్‌బుల్‌ ఈ వేలంపాటను మే 25వ తేదీన నిర్వహించనుంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఒక విస్కీబాటిల్‌ అత్యధికంగా 1.9 మిలియన్‌ డాలర్లు అమ్ముడుపోయింది. ఈ రికార్డును ది ఇంట్రెపిడ్‌ బద్ధలు కొట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు వేలం ద్వారా మరో రికార్డుకు సిద్ధం అవుతున్నారు. వేలంపాటలో ప్రారంభ ధరనే 1.3 మిలియన్‌ పౌండ్లుగా అనుకుంటున్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తంలో.. 25 శాతాన్ని మేరీ క్యూరీ చారిటీకి ఇవ్వాలని భావిస్తున్నారు.

                                   

About Author