క్వార్టర్ ఫైనల్ కు రెజ్లర్ రవి దహియా
1 min readపల్లె వెలుగు వెబ్ : టోక్యో ఒలంపిక్స్ లో రెజ్లర్ రవి దహియా క్వార్టర్స్ కు చేరుకున్నారు. కొలంబియాకు చెందిన టిగ్రరోస్ పై 13-2 తేడాతో ఘన విజయం సాధించాడు. పురుషుల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో టిగ్రరోస్ పై విజయంతో రవి దహియా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. మరోవైపు మహిళల 57 కేజీల విభాగంలో అన్షు మాలిక్ నిరాశపరిచింది. క్వార్టర్స్ కు ఆమె అర్హత సాధించలేకపోయింది. బెలారస్ కు చెందిన కురాచ్ కినా చేతిలో అన్షు మాలిక్ ఓటమి పాలైంది.